విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీ టీడీపీకి సవాలు విసిరే వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీడీపీ ఏ పిట్టల దొరకు సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.
Buddha Venkanna: ఏపీలో అంతంతమాత్రంగానే ఉన్న.. టీడీపీలో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా.. గెలుపుపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. వారిలో వారు పోట్లాటలతో, మాటల యుద్ధం చేసుకుంటూ.. అధిపత్యం కోసం కొట్టుకుంటున్న తీరు చూసి టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు తాజాగా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. పార్టీలో తనను కావాలనే పక్కకు పెడుతున్నారని.. […]
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్వాతంత్ర్యం రాక ముందు దేశం దీనస్థితిలో ఉందని.. కోహినూర్ వజ్రంతో సహా విలువైనవెన్నో బ్రిటిషర్స్ దోచుకున్నారని అన్నారు. అయితే ఇప్పుడు భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, వైద్యరంగానికి భారతదేశం ప్రపంచానికే ఒక మైలురాయిలా మారిందని అన్నారు. ప్రపంచానికి మొదటి కోవిడ్ వ్యాక్సిన్ మన దేశమే ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక రాజకీయాల […]
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఎంపీ కేశినాని నాని ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో చంద్రబాబుకు పుష్ప గుచ్ఛం ఇవ్వాలని […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. హస్తినాకు వచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చేందుకు కేశినేని నిరాకరించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ […]
నిర్మాత అశ్వనీదత్ వ్యవహారం చూస్తే.. ఎన్నికల్లో బరిలో నిలిచే ఆలోచన ఉందా.. అందుకే ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మీద ఇంత ధాటిగా విమర్శలు చేస్తున్నారా.. అనే అనుమానాలు తలెత్తకమానవు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతుండటంతో.. టీడీపీ నుంచే బరిలో దిగి అవకాశాలే అధికంగా ఉన్నాయి అంటున్నారు. ఇక గతంలోనే ఆయన 2004లో విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. […]
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారా.. అందుకే ఇలా సొంత పార్టీ, కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేస్తున్నారా అంటే అవుననే వాదనలే బలంగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా పార్టీ వ్యవహాలపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని.. బహిరంగంగానే టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. విజయవాడ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా టీడీపీలో ఎంపీ కేశినేని వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద ఎత్తున చర్చకు, రచ్చకు కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం సోదరుడు […]