కర్ణాటకలోని చిత్తాపుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే.. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని, అలానే ఉద్యోగాల పేరుతో మహిళలను శారీరక కోరిక తీర్చమని అధికారులు అడుగుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగాలని అమ్ముతున్నారని ఖర్గే ఆరోపించారు. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో 1492 ఉద్యోగాలను భర్తీ చేశారని, ఈ ప్రక్రియలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారుల […]
రాజకీయ రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రజల కోసం నిరంతరం నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీరామ రెడ్డి(75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. CPM తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేవారు. అందుకే రెండు పర్యాయాలు ప్రజలు సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిపించారు. బాగేపల్లిలోని తన నివాసం ఉంటున్న శ్రీరామరెడ్డి ఇటీవల మోకాలకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తన నివాసంలో విశ్రాంతి […]
నిత్యం ఏదో ఒక చోట బాంబు బెదిరింపులు వినిపిస్తుంటాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురైవుతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో బాంబు బెదింపులు.. స్థానికంగా కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బెంగుళూరు లోని ఏడు పాఠశాలలకి ఓ అజ్ఞాత అకౌంట్ నుంచి మెయిల్ వచ్చింది. పాఠశాలలో శక్తివంతమైన బాంబు ఉందని.. ఇది జోక్ కాదు. మీతో పాటు వందల మంది ప్రాణాలకు ప్రమాదం ఉంది. అంతా మీ చేతుల్లోనే ఉంది’ అంటూ మెయిల్ చేశారు. అంతేకాకుండా పాఠశాలల […]
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక.. నవీన్ మరణంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రవేదనకు లోనయ్యారు. కుమారుడు మరణంతో తీవ్ర కలత చెందిన నవీన్ తండ్రి శేఖరప్ప భారతీయ వైద్య విద్యా వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని హవేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన నవీన్.. ఖార్గీవ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ కి వెళ్లాడు. ఇప్పుడు మెడిసిన్ […]
కర్ణాటకలో రాజకీయ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎగిసిపడుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్డ్యూరప్పకు సొంత పార్టీ నేతల వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సీఎం యడ్డ్యూరప్పను తొలగించాలని తెర వెనకాల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలల నుంచి సీఎం రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు కోడై కూస్తున్నాయి. ఏకంగా జాతీయ మీడియాలో సైతం యడ్డీ రాజీనామాపై వరుస కథనాలు వెలువడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం యడ్డ్యూరప్ప నెలకొసారి […]
మనలో చాలా మందికి కుక్కలు అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందైతే వాటిని తమ బిడ్డల్లానే చూసుకుంటూ పెంచుతుంటారు. వాటితోనే కలసి తింటారు. కలసి నిద్రపోతారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నిజానికి కుక్కలను పెంచుకోవడం అంత సులభమైన పని కాదు. ఒక్కొక్కసారి అవి చేసే అల్లరికి హద్దు అంటూ ఉండదు. కానీ.., ఇక్కడ ఓ కుక్క మాత్రం యజమాని బంగారు చైన్ ని తినేసింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి […]