టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకరకంగా దేశంలో ఇంటర్నెట్ విప్లవానికి జియో కారణమని నిపుణులు అంటుంటారు. అలాంటి జియో నుంచి ఇప్పుడు ఒక కొత్త ప్రాడక్ట్ రాబోతోంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే కాదు.. బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా బాగా పెరిగాయి. చాలా మంది ఇళ్లలో వైఫై కనెక్షన్ పెట్టించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో జియో కంపెనీ నుంచి ఒక అద్భుతమైన బ్రాడ్ బ్యాడ్ బ్యాకప్ ప్లాన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.
రిలయన్స్ జియోకి ఎంత ఆదరణ ఉందో.. జియో ఫైబర్‌కి కూడా అదే ఆదరణ తీసుకురావాలని కంపెనీ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ సందర్భంగా జియో ఫైబర్ నుంచి వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు వచ్చాయి. అదేంటంటే.. కొత్తగా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి రిలయన్స్ జియో డబుల్ బొనాంజా ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. మీరు జియో ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకుంటే మీకు రూ.6,500 వరకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ […]