ప్రపంచాన్ని గజ గజ వణికించింది కరోనా మహమ్మారి. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక నష్టాన్ని కూడా మిగిల్చింది. దీంతో ఎన్నో దిగ్గజ కంపెనీలు దివాల తీశాయి. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను వేల సంఖ్యలో తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఐతే దిగ్గజం విప్రో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బోర్డు డైరెక్టర్లతో జరగనున్న సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇంకో మూడు రోజుల్లో విప్రో కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త జాబ్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం ఉండట్లేదు. ఓ టెకీ అయితే ఉద్యోగం కోసం ఏకంగా 150కి పైగా సంస్థల్లో దరఖాస్తు చేసుకున్నాడు. మిగిలిన వివరాలు..
చాట్ జీపీటీ.. ఈమధ్య కాలంలో బాగా మార్మోగుతున్న పేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ చాట్‌బాట్ అసాధ్యం అనే పనులను కూడా సులువుగా చేసేస్తోంది. దీని వల్ల భవిష్యత్తులో చాలా జాబ్స్ పోతాయని వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
ఉద్యోగ ఒత్తిడి, పర్సనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఎటు వైపు ఒత్తిడి కలిగినా నరకమే. పొద్దునే 10 గంటలకు క్యారీయర్ మోసుకుని, సాయంత్రం ఆరు దాటినా ఉద్యోగం చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందుతున్నారు. సరిగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇదే విషయాన్ని గ్రహించిన ఓ సంస్థ తీసుకున్న నిర్ణయం భలేగా ఉందనిపిస్తోంది.
ఆర్థిక మాంద్యం భయాలతో ఐటీ రంగంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి. గత కొన్ని నెలల వ్యవధిలో టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1.50 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలుస్తోంది. రోజుకో కంపెనీ లేఆఫ్ ప్రకటిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఆశావహుల్లో వణుకు మొదలైంది. […]
ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం టీఎస్ ఆర్టీసి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అద్దెకు బస్సులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటిదాకా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులను సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చేరుస్తున్న.. ఆర్టీసి, ఇకపై అద్దెకు బస్సులు ఇచ్చేటందుకు సిద్ధమైంది. ఇప్పటికే.. ఈ విషయంపై 20 పైగా సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. అలా అద్దెకిచ్చిన బస్సులకు కిలోమీటర్ల వారీగా చార్జీలు వసూలు చేయనున్నారు. అందుకు సంబంధించిన చార్జీల వివరాలను విడుదల […]
దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ కొన్ని కంపెనీలు ఏదో సాకు చెప్పి ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు పలు రకాల సాకులు చెప్పి ఉద్యోగులను బయటకు గెంటివేసింది. మూన్ లైటింగ్ అని, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారని, ఆర్థిక మాంద్యం ఇలా రకరకాల కారణాలు చెప్పి చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సేల్స్ ఫోర్స్ కంపెనీ చేరిపోయింది. పేరులో ఉన్న ఫోర్స్ కి తగ్గట్టే అంతే ఫోర్స్ గా […]
ఐటీ సెక్టార్.. ఇప్పుడిప్పుడే కొవిడ్ పంజా నుంచి కోలుకుంటోంది. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు బాటలు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అన్ని దిగ్గజ ఐటీ కంపెనీలకు మూన్ లైటింగ్ సమస్యగా మారింది. అంటే ఒకే ఉద్యోగి రెండు కెంపెనీలకు పనిచేస్తూ ఉండటం. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒకే ఉద్యోగి రెండు కంపెనీలకు పనిచేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలోనే చాలా కంపెనీలు ఈ విషయాన్ని గుర్తించాయి. తర్వాత విప్రో కంపెనీ […]
ఫ్రెషర్స్, నిరుద్యోగుల్లో చాలా మంది ఐటీ రంగంలో ఉద్యోగం పొందాలనేది కల అంటారు. అలాగే వారు కోరుకున్నట్లు పెద్ద పెద్ద కార్పొరేట్, ఐటీ సంస్థల్లో ఉద్యోగం పొంద గలిగితే వారికన్నా అదృష్టవంతులు లేరని ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు చాలా మందికి ఆ అదృష్టం లేకుండా పోతోంది. ఎందుకంటే విప్రో, ఇఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ కి ఆఫర్ లెటర్ ఇచ్చినట్లే ఇచ్చి కొంతకాలం తర్వాత మీ జాయిన్ ఆఫర్‌ని రద్దు చేస్తున్నాం […]