గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. వారం క్రితం ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన అధికారులు, రెండు ప్రొక్లెయినర్లతో గ్రామానికి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, జనసేన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటం గ్రామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళు కూల్చారని జనసేన అంటుంటే.. అసలు ఇళ్లే కూల్చలేదని వైసీపీ అంటోంది. ఇప్పటికే ఇప్పటం ఇళ్ల కూల్చివేత విషయంలో అబద్ధం చెప్పినందుకు ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. […]
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ఇప్పటం గ్రామస్తులకు భారీ జరిమానా విధించింది. ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టులో పిటిషన్ వేసిన 14 మందికి జరిమానా విధించింది. ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున 14 మందికి 14 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో అక్రమ నిర్మాణాలను తొలగించమని తమకు అధికారులు ఎలాంటి […]
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఏ1గా, ఆయన కారు డ్రైవర్ ను ఏ2 గా చేర్చి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ నవంబర్ 5న ఇప్పటం గ్రామానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కారు పై భాగంలో కూర్చుని ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […]
గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కావాలనే.. టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లను ధ్వంసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ ఇళ్లు ఎవరూ కూల్చలేదని.. తమకెవరి సానుభూతి అవసరం లేదని ఇప్పటం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు […]
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే కూల్చివేతలకు పాల్పడిందని జనసేన ఆరోపిస్తోంది. తమ పార్టీ సభకు భూములిచ్చారన్న కారణంగానే.. ఇప్పటం గ్రామంలోని పలువురి ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందంటూ జనసేన ఆరోపించింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. […]
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం పేరు కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇప్పటం గ్రామంలో రోడ్లను విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ విస్తరణపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కావాలనే ఇప్పటం గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణలు, విమర్శలు చేశారు. కొందరైతే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తొలగిస్తూ వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం కదిలించకుండా వదిలేశారంటూ ఆరోపించారు. అయితే అవన్నీ అవాస్తవమని అధికారులు సైతం వెల్లడించారు. అంతేకాకుండా అవి ఆరోపణలు […]
పవన్ కల్యాణ్.. రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాలు, సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగిపోతోంది. మార్చి 14న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ గురించే ఇంకా చర్చోపచర్చలు నడుస్తూ ఉన్నాయి. సభలో పవన్ చేసిన ప్రసంగం, అక్కడికి వచ్చిన అశేష అభిమానగణం ఈ విషయాలే వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ సభ జరిగిన ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: OTTలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆ […]