భారత్ వేదికగా అక్టోబర్ లో వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో టీమిండియా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద ఎక్కువ బాధ్యత ఉంది. నిన్న ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేయగా.. వీరిద్దరు ఈ మ్యాచ్ లపై స్పందించారు. అయితే కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఒకే గ్రౌండ్ మీద మనసు పారేసుకోవడం గమనార్హం.
ఈ ఏడాది భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్లు ఎక్కువ ఉంటాయన్నాడు.
క్రికెట్ లవర్స్ కు హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే కప్ లను హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చంటూ అధికారికంగా ప్రకటించింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కి మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. 1975 లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవగా.. ఈ ఏడాది జరగబోయేది 13 వది కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తాజాగా ఐసీసీ వరల్డ్ కప్ కీలక మ్యాచులు ప్రకటించారు. దీని ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్ ఎప్పుడు ? చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ ఎప్పుడనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.