కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్‌కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల […]
హైదరాబాద్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. నవంబర్ 2న హుజూరాబాద్ ఎన్నిక ఫలితం వెలువడనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి […]
కరీనంగర్- తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల చెమట సొమ్మేనని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమని, నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు కుల మతాలతో సంబంధం లేదన్న ఈటల, తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకేనని తేల్చి చెప్పారు. ఆర్థిక అంశాలతో పాటు ఆత్మ గౌరవం కూడా ముఖ్యమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో జరిగిన […]
పొలిటికల్ డెస్క్- మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. నిబంధనల మేరకు ఆరు నెలల్లోపు హుజూరాబాద్ కు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఈటలను ఓడించి, మళ్లీ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈమేరకు ఇప్పటి నుంచి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి. […]
హైదరాబాద్- జమున హ్యాచరిస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ఆరోపంచారు. అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం ఎలాగో తెలుసని ఆమె అన్నారు. ఎవరిని మోసం చేయలేదని, కష్టపడి పైకి వచ్చామని వ్యాఖ్యానించారు. ముసాయి పేటలో 46 ఎకరాలు కొన్నామని, కొన్నదాని కంటే ఒక ఎకరా భూమి ఎక్కువగా ఉన్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు జమున. మరి మీ ఆరోపణలు అబద్దమని తేలితే మీరు ముక్కునేలకు […]
హైదరాబాద్- గత కొన్ని రోజులుగా తన రాజకీయ భవితవ్యంపై ఉగిసలాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశాక ఆయన అనుచరులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. తెలంగాణలో వివిధ పార్టీల ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఐతే ఇప్పటి వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్ తో బీజేపీ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ […]
హైదరాబాద్- తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్‌కు సీఎం కార్యాలయం అధికారులు లేఖ పంపారు. అవకాశం ఇచ్చినా రాజీనామా చేయకపోవడంతో ఈటలను బర్తరఫ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. శనివారం ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తొలగించి, ఆ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదలాయించారు. దీంతో ఈటల మంత్రి పదవికి రాజీనామా చేస్తారని అంతా భావించారు. కానీ ఈటల రాజీనామా […]