అసలే వచ్చేది వేసవి కాలం.. ఏసీలు, కూలర్లు లేకపోతే బతకడం కష్టం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. సాధారణంగానే వేసవిలో కరెంటు బిల్లు మోత మోగిపోతుంది. దానికి తోడు ప్రభుత్వం త్వరలోనే కరెంట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకుంది. దాంతో ఈ వేసవిలో సామాన్యులకు కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొట్టే పరిస్థితి తలెత్తనుంది. ఆ వివరాలు..
ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు’ అయ్యింది ప్రస్తుతం ప్రజల పరిస్థితి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయ ధరలు ఓ పక్క మండిపోతుంటే.. ఇవి చాలదు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారం ప్రజలపై మోపనుంది. విద్యుత్ వినియోగదారులపై ఇక నుంచి భారం పడనుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి( ERC)బుధవారం […]
ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇస్తాయి. ఇక గెలిచి అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన హామీల్లో చాలా వాటిని పట్టించుకోరు. మళ్లీ ఎన్నికల ముందు.. వాటిని అమలు చేస్తారు. కానీ తమ పార్టీ మాత్రం ఇందుకు భిన్నం అని.. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన ప్రతి హామీని.. మొదటి ఏడాది నుంచే అమలు చేస్తామని అంటున్నారు పంజాబ్ ఆప్ నేతలు. ఎన్నికల సమయంలో.. తమను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తామని ఆప్ […]
దేశ వ్యాప్తంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక్కో షాక్ తగులుతూ వస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గ్యాస్, చమురు ధరలు పెరిగి సతమతమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 14శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఆఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి 19శాతం పెంపునకు అనుమతికోరాయి డిస్కంలు. డొమెస్టిక్ పై 40-50పైసల పెంపు.. ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంపు. 19 శాతం విద్యుత్ చార్జీల […]