ఆర్సీబీ జట్టు తలరాత మారలేదు. ఆ జట్టు మరోమారు కప్ గెలవకుండానే ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని ముగించింది. బెంగళూరు వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్వయంగా ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు కప్ గెలవదని ముందే చెప్పాడు. కానీ దీన్ని ఎవరూ నమ్మలేదు.
ఆర్సీబీకి మళ్లీ నిరాశే. గుజరాత్ చేతిలో ఓడి.. ప్లే ఆఫ్స్ కి చేరలేకపోయింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే టాప్-4కి కూడా వెళ్లలేకపోయింది. అసలు ఆర్సీబీ పరిస్థితి ఇలా కావడానికి కారణలేంటి? ఈ జట్టు ఎప్పుడు కప్ కొడుతుంది?
ప్రతి సీజన్ లానే ఆర్సీబీకి ఆటతీరులో ఈసారి కూడా అస్సలు మారలేదు. తొలి మ్యాచ్ లో గెలిచింది. ఆ తర్వాత రెండింటిలో ఓడిపోయింది. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది? బెంగళూరు ప్లేయర్లు ఏం చేస్తున్నారు?
''ఈ సాలా కప్ నమ్దే".. ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉందో.. ఈ స్లోగన్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పేటెంట్ హక్కులా ఈ స్లోగన్ ఉంది. ఇక ఈ స్లోగన్ పై తాజాగా స్పందించాడు కింగ్ విరాట్ కోహ్లీ.