ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పలు మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని తెలుస్తోంది. దీంతో వీళ్లు ఎలా చనిపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఉత్తరాఖండ్‌లోని పిథౌర్‌గఢ్ జిల్లాలో సరయూ నది ఒడ్డున డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతదేహాలు కరోనా బాధితులకు చెందినవని భావిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ వ్యాప్తి మధ్య గంగతోపాటు ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు కనిపించడం ఇటీవలి కాలంలో సంచలనంగా మారింది. ఈ విధంగా నదీ తీరాలలో మృతదేహాలు కనిపించడం ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని సరయూ నదిలో కూడా మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి. […]