దుమ్మాయిగూడలో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఆ తర్వాత చిన్నారి చెరువులో శవమై కనిపించిన కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. పాప నీటిలో పడి చనిపోవటానికి కారణం ఏంటన్నది తెలియరావటం లేదు. తమ కూతుర్ని చంపేసి నీటిలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. పాప చెరువులో పడ్డ ప్రదేశంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాప మృతికి గల సరైన కారణాలు కనుక్కుని పాప కుటుంబానికి న్యాయం చేయాలని సామాన్య జనం […]
జవహర్నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, అటుపైపు గాలించగా నీటిపై చిన్నారి శవం తేలుతూ కనిపించింది. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు. అయితే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం […]
బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు వైద్యులు. కనబడకుండా పోయిన పదేళ్ల బాలిక చివరికి చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలను బయటపెట్టారు. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. అయితే ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. చెరువులో పడి నీరు మింగడం వల్ల బాలిక చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే […]
మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో 10 ఏళ్ల బాలిక నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఉదయం బాలిక ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ హెడ్ మాస్టార్ ను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప ఎక్కడికి వెళ్లిందో మాకు కూడా తెలియదని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. కానీ […]