క్రికెటర్లకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. వారిని చాలా మంది ఆరాధిస్తుంటారు, స్ఫూర్తిగా కూడా తీసుకుంటారు. అలాంటి ప్లేయర్లు తప్పులు చేస్తే, హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? అది వ్యక్తిగత ఇమేజ్ను పాడు చేయడంతో పాటు ఆట ప్రతిష్టను కూడా దిగజారుస్తుంది.
సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు డిసెంబర్ 31ని బాగా సెలబ్రెట్ చేసుకున్నారు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలిమ్యాచ్ అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా న్యూ ఇయర్ పార్టీలో ఆ గెలుపును ఎంజాయ్ చేసినట్లు కనిపించారు. ఈ పార్టీలో టీమిండియా ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కుర్రాళ్లతో కలిసి ఎంజాయ్ చేయడం హైలెట్‌గా నిలిచింది. మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా పార్టీ మూడ్‌లో కనిపించారు. భారీ కేక్‌ను కట్ చేసిన […]