వంటింట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా. వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుంటే మహిళలకు ఏ పనీ తోచదు. నూనె సమపాళ్లల్లో వేయకపోతే కూర కూడా రుచిగా ఉండదు. నెల వారీ సరుకుల్లో కూడా నూనెకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వీటి ధరలపై కూడా ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
రోజూ పెరుగుతున్న నిత్యవసర ధరలను చూసి సామాన్యుడికి రాత్రుళ్లు నిద్ర రావడం లేదు. చాలీచాలని జీతం, ఆకాశానంటిన ధరలతో మధ్య తరగతి వ్యక్తి అల్లాడిపోతున్నాడు. పెట్రోల్, డీజిల ధరలు మండిపోతుంటే, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగి గుది బండలాగ మారాయి. ఇలా అన్ని ధరలు మండిపోతున్న సమయంలో సామాన్యుడికి ఓ శుభవార్త. వంట నూనెల ధరలు లీటర్ పై రూ.10 నుంచి రూ.12 వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో […]
నిత్యవసర ధరల పెరుగుదలతో సామాన్యుడు ఆర్థికంగా సమతమవుతున్నాడు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటివి పెరిగి.. మధ్యతరగతి కుటుంబాలు మరింతగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ఇంధన ధరలు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా సామాన్యులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూ స్ చెప్పింది. అందరూ నిత్యం ఉపయోగించే వంటనూనెల ధరల్లో ఉపశమనం కలిగించనుంది. సోయాబీన్ సన్ ప్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీస్తోందని బ్లూమ్ […]
విమానయాన రంగంలో ఊహించని మలుపు ఏర్పాటు అయింది. ఆకాశంలో దూసుకుపోయే విమానాలే ఓ అద్భుతం అంటే దానిని తలదన్నేలా వంట నూనెను ఇంధనంగా ఓ విమానం ఆకాశంలో పొగలు కక్కుతూ పరుగులు తీస్తూ విజయవంతంగా ల్యాండ్ అయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థకు చెందిన AIR BUS A-380 అనే విమానం పూర్తిగా వంట నూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని ముగించింది. ఇది కూడా చదవండి: […]
పొద్దున్నే వేడివేడిగా పూరీ.. సాయంత్రం కారం కారంగా మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటే వచ్చే మజానే వేరు. అనుభవించాల్సిందే కానీ.. ఆ అనుభూతిని వర్ణించలేం. బయట టిఫిన్ చేయాల్సి వస్తే.. చాలా మంది పూరీకే ఓటేస్తారు. పైగా ఇది ఖరీదైన టిఫిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక మిరపకాయ బజ్జీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరతాయి. ఈ వార్త చదువుతుండగానే.. మీకు ఓ సారి మిర్చి తినాలనిపిస్తే.. కాస్త ఆగండి. […]
నాటో లో ఉక్రెయిన్ చేరితే తమకు సరిహద్దు పరంగా ప్రమాదం పొంచి ఉందని ఆ దేశంపై రష్యా సైనిక చర్య ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడుతుంది. రష్యా యుద్ధం ప్రభావంతో పెట్రోల్, డిజిల్, బంగారం ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్ కూడా భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఇప్పుడు సామాన్యుడి నిత్యం వాడుకునే వంటనూనె మీద కూడా పడనుంది. […]