సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యక్తులను టార్గెట్ చేసి అవమానిస్తే అరెస్టులు తప్పవు. వాట్సాప్ గ్రూపులోనే కదా సీఎం, పీఎంలని తిడుతూ పోస్టులు పెడితే ఏమవుతుంది అనుకుంటే పొరపాటే. నచ్చని వాళ్ళు ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్ పై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో వరుసగా గ్యాంగ్స్టర్స్ ని ఎన్ కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వారు ఎక్కడ దాక్కున్నారో ఎవరికీ తెలీదు.
దొంగ ఎక్కడైనా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం చూశారా? ఎప్పుడో గానీ ఇలా జరగదు. కానీ ఒక బైక్ దొంగ స్వయంగా పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి బాబోయ్ అంటూ పశ్చాత్తాపం చెందుతున్నాడు.
దేశంలో ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. మహిళల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నాయి. సాధారణంగా రక్షాబంధన్ పండుగ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కొన్ని ప్రభుత్వాలు ఉచిత బస్ సౌకర్యం కల్పిచండం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నది.. అది ఎక్కడ? అనే విషయం గురించి తెలుసుకుందాం… ఉత్తరప్రదేశ్ లో ప్రజాభినామంతో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు యోగి ఆదిత్యనాథ్. ఉత్తర్ ప్రదేశ్ […]
దీపావళి అంటే ప్రత్యేకమైన పండుగ. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే అతి పెద్ద వేడుక. ఈరోజున ఇంటి లోపల, బయటా మట్టి దీపాలతో అలంకరించి.. టపాసులు కాలుస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దీపాలు వెలిగిస్తేనే ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. అలాంటిది లక్షల్లో దీపాలు వెలిగిస్తే ఆ ప్రాంగణం ఇంకెంత మనోహరంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? ఆహా ఆ అద్భుతమైన […]
సినీ, రాజకీయ, క్రీడాకారులకు హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. కొంత మంది అభిమానులు తాము ఆరాదించేవారి కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. తాము అభిమానించే నటులు, రాజకీయ నేతల పుట్టిన రోజు ధూమ్ ధామ్ గా నిర్వహిస్తుంటారు. మరికొంత మంది అభిమానులు ఏకంగా గుడి కట్టించి పూజలు కూడా చేస్తుంటారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ అంటే ఎంతో మంది అభిమానిస్తుంటారు. అందులో ఓ వీరాభిమాని సీఎం యోగి కి ఓ గుడి నిర్మించి పూజలు […]
సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. దేవుడికి బదులుగా ఈ భూమిపై అమ్మను సృష్టించారు అంటారు. తల్లిదండ్రులకు తమ కుమారుడు మంచి ప్రయోజకుడు అయితే.. ఎంత గొప్ప అనందమో […]