దేశంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల కనీస వివాహ వయసు కూడా 21ఏళ్లు ఉండాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు కాగా అబ్బాయిల వయసు 21. కొన్నేళ్లుగా ఈ వ్యత్యాసం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల వయసు తక్కువగా ఉండడం వలన వారి కెరీర్ తో ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు వాదించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పెళ్లి కోసం అమ్మాయిల […]
న్యూ ఢిల్లీ- ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా డిమాండ్ ఉన్న ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022లో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం […]
న్యూఢిల్లీ- ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయిన నేపధ్యంలో మోదీ మంత్రివర్గ ప్రక్షాళన చేశారు. కొంత మందికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికి, కొంత మంది కొత్తవాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు శాఖలను కెటాయించారు. 1. నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి […]
న్యూఢిల్లీ- కేంద్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. ఈ రోజు బుధవారం సాయంత్రం 6 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మోదీ క్యాబినెట్ లోకి రాబోతున్న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల గురించి ఇంకా ఉత్కంఠ నెలకొంది. మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు.. సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయోనే విషయంపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో బడుగు, బలహీన, […]
న్యూ ఢిల్లీ- కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. చాలా రోజుల నుంచి క్యాబినెట్ విస్తరణపై కసరత్తు చేస్తున్న మోదీ ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్నదానిపై ప్రధాని జాబితా సిద్దం చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ బుధవారం జరగనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి […]
న్యూ ఢిల్లీ- కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. 2019 ఎన్నికల్లో రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లీ పగ్గాలు చేపట్టారు. అప్పుడు ఏర్పాటైన మంత్రివర్గాన్ని విస్తరించాలని మోదీ భావిస్తున్నారు. గత వారం రోజులుగా మోదీ బీజేపీ అగ్ర నేతలతో పాటు, ఆయన సన్నిహిత మంత్రులతోనూ విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సారి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థాన […]