బాలకృష్ణ అనే పేరులోనే బ్రాండ్ ఉంది. ఇదే బ్రాండ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అందరినీ మెప్పించారు. ఈ షో ముగిసింది. అయితే ఆయన మరోసారి ఓటీటీలో అభిమానుల్ని పలకరించబోతున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి మరోసారి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైందీ ఆహా.
టాలీవుడ్ అగ్రనట్లుల్లో ఒకరైన బాలకృష్ణ పేరు తెలియని ఇండస్ట్రీ లేదు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అందరికీ సుపరిచితమైన నటుడు. ఆయన తెరమీద కనిపిస్తే చాలు జై బాలయ్య నినాదాలే. సినిమా చేసినా, షో చేసినా రికార్డులే. ఇప్పుడు బాలకృష్ణ మరో ప్రయాణం దిశగా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరు ఒక సంచలనం. నటుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో బాలయ్య చూడని విజయాలు లేవు. ఆయన అందుకొని రికార్డ్స్ లేవు. తెలుగు తెరపై నటసింహం అయినా ఆయనే. సీమ సింహం అయినా ఆయనే. ఇందుకే బాలయ్యకి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది . ఇక ఈ జూన్ 10వ తేదీతో నందమూరి బాలకృష్ణ 61 వసంతంలోకి అడుగుపెట్టారు. […]
నందమూరి.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరుకి ఉండే పవర్ అంతా ఇంతా కాదు. నటుడిగా, నాయకుడిగా సీనియర్ యన్టీఆర్ తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పారు. ఇక ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలిగారు. నటుడిగా 35 ఏళ్లకి పైబడి బాలయ్య చేయని ప్రయోగాలు లేవు. ఆయన అందుకొని రికార్డ్స్, రివార్డ్స్ లేవు. మరోవైపు హిందుపురం ఎమ్మెల్యేగా కూడా ఈయన ప్రజల హృదయాన్ని గెలుచుకోగలిగారు. యన్టీఆర్ కొడుకుగా ఇంత సాధించారు కాబట్టే […]
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]