వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేసినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ క్రాస్ ఓటింగ్ ఘటను సీరియస్ తీసుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడ్డ సంగతి అందరికీ విదితమే. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా. 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా విజయం సాధించారు.
మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు.
నెల్లూరు జిల్లా రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వీడారు. ఇప్పుడదే బాటలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుండి తప్పుకునే ఆలోచన చేస్తున్నారట. తనకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి కారణంగా కోటంరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కాదని, జిల్లాలో వేరే ముగ్గురికి మంత్రి పదవులు సీఎం […]
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. తనకు కావాలనే సెక్యూరిటీ తగ్గించారంటూ ఆరోపణలు చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి పలు ఆరోపణలు చేశారు. గత రెండేళ్లుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన పీఏ ఫోన్ తో పాటుగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతోందన్నారు. అందుకే తాను ఇప్పటికీ యాప్ ల ద్వారానే మాట్లాడుతున్నట్లు తెలిపారు. తనకు ప్రాణహాని కూడా ఉందంటూ తీవ్ర […]
ఆనం రామనారాయణ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక సింహపురి వాసులకు అయితే ఆనం కుటుంబం గురించి చెప్పనక్కర్లేదు. ఆనం కుటుంబాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆనం కుటుంబంలో రామనారాయణ రెడ్డి కీలకమైన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రలో మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. వివధ కారణాలతో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. 2019లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక […]
ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహానీయుడు పొట్టి శ్రీరాములు జన్మించింది ఈ జిల్లాలోనే. రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ఇక కొత్త రాష్టం ఏర్పాటైన దగ్గర నుంచి నెల్లూరులో అధికార పార్టీ వైసీపీనే విజయం సాధిస్తూ వస్తోంది. నెల్లూరులోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. విపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టారంటూ ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. మాట్లాడతానని తెలిపారు. మరోవైపు […]