ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా లంచగొండి అధికారిని పట్టుకున్న తర్వాత పింక్ రంగులో ఉన్న సీసాలను ఉంచుతారు. అలా ఎందుకు పెడతారో, దీనికి గల కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే.. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పీడించే వారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారిపై నిత్యం వందల ఫిర్యాదులు వస్తుంటాయి. తరచూ ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.