క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. తాను కూడా దాని బారిన పడ్డానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ పరంగా స్కోప్ ఉన్నప్పటికీ.. నటనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ హీరోయిన్ల క్యారెక్టర్స్ ని డిజైన్ చేసేవారు. ఓవైపు భార్యంటే ఇలా ఉండాలి.. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనిపించేలా ఉండేవి ఆ పాత్రలు. అలా ఇండస్ట్రీలో అసలు సిసలైన గృహిణి అంటే.. భార్యంటే ఇలా ఉండాలి అని తన నటనతో మెప్పించిన నటి ఆమని.
ఒకప్పటి హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కున్న విషయాన్ని బయటపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో తనను ఒక దర్శకుడు ఒంటరిగా రావాలంటూ ఫోన్ చేయించాడని వెల్లడించారు.