రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా ఆయన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. అలాంటి వ్యక్తి తన తొలి సినిమా ‘చిలకా గోరింకా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తొలి సినిమా కోసం కృష్ణంరాజు ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు. ఆయన పడ్డ కష్టానికి తొలి సినిమా ఫలితం ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన కృష్ణంరాజు ఇండస్ట్రీని వదిలేసి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నారు. కానీ.. ఆయన ఒకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచింది. తెలుగు సినిమాకు ఒక రెబల్‌స్టార్ మిస్ అవ్వకుండా కాపాడింది. ఇండస్ట్రీని వదిలే క్రమంలో ఒక రోజు అనుకోకుండా.. సినీ దిగ్గజం ఎల్వీ ప్రసాద్‌ను కృష్ణంరాజు కలిశారు. ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం మారిపోయింది. ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచన చచ్చిపోయింది.
చిలకా గోరింకా సినిమా తర్వాత.. ‘నేనంటే నేనే’ అనే చిత్రంలో నటించే అవకాశం కృష్ణంరాజును వరించింది. కానీ.. అది నెగిటివ్ షేడ్ పాత్ర కావడంతో ఆ సినిమాను కాదనుకున్నారు. కానీ.. ఎల్వీ ప్రసాద్ చెప్పిన మాట ‘పాత్ర ఎలాంటిదైనా నువ్వు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యం’ ఆయనను ‘నేనంటే నేనే’ సినిమా చేయడానికి ఒప్పించింది. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్. ఇక్కడి నుంచి కృష్ణంరాజుకు అవకాశాలు క్యూకట్టాయి. మరెన్నో విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. అద్భుతమైన సినిమాలు చేశారు. అమర దీపం, భక్తకన్నప్ప, తాండ్ర పాపారాయుడు లాంటి గొప్పగొప్ప సినిమాలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్‌స్టార్‌గా ఎదిగారు.
చిలకా గోరింకా సినిమా ఫెల్యూర్ తర్వాత ఎల్వీ ప్రసాద్ మాటలే కృష్ణంరాజును ఇండస్ట్రీని వదిలి పోకుండా ఆపాయి. మనకు ఒక రెబల్‌స్టార్‌ను, ఆ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను అందిచాయి. ఎల్వీ ప్రసాద్‌తో ఎల్వీ ప్రసాద్‌తో అనుబంధం లేకుంటే.. తాను ఇండస్ట్రీ వదిలి ఎప్పుడో వెళ్లిపోయే వాడినని స్వయంగా కృష్ణంరాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. కృష్ణంరాజు ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు.. ఇటివల గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి.. చికిత్స పోందుతూ ఆదివారం మృతి చెందారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం, డయాబెటిస్, తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతోనే కృష్ణంరాజు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరి కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీకి జరిగిన నష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Deeply saddened by the passing of the Iconic Rebel Star Krishnam Raju garu. Heartfelt condolences to his near and dear ones. May his soul rest in peace. pic.twitter.com/l2Dr75sX4e
— Suresh Productions (@SureshProdns) September 11, 2022