వీరేంద్ర సెహ్వాగ్.. ‘పేరుకు ఎక్కువసేపు నిలవలేడు అనే అపవాద ఉన్నా.. భారత జట్టు గర్వించదగ్గ ఓపెనర్లలో ఒకడిగా తన స్థానం చెరగనిది’. సెహ్వాగ్ క్రీజులో ఉన్నంతసేపు అభిమానులకు పండగే. బాల్ పడిందా.. బౌండరీకి వెళ్లిందా.. అన్న రీతిలో బ్యాటింగ్ ఉంటుంది. ఎంతటి బౌలరైనా సెహ్వాగ్ కు బౌలింగ్ వేయాలంటే బయపడాల్సిందే. టెస్టు, వన్డే, టీ20 అనే బేధాలుండవ్.. ఏదైనా ఒకే ఫార్మాట్. ఈ బ్యాటింగ్ శైలే.. అభిమానులకు సెహ్వాగ్ ను దగ్గర చేసింది. అలాంటి దిగ్గజ ఆటగాడు, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని.. తనను కావాలనే జట్టులోంచి తప్పించాడని, ఆ సమయంలో తాను మానసికంగా చాలా కుంగిపోయానని చెప్పుకొచ్చాడు.
తాజాగా ఒక స్పోర్ట్స్ ఛానల్ తో ముచ్చటించిన సెహ్వాగ్.. “2008లో మేం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాం. ఆ టైం లో నేను ఫామ్ కోల్పోయాను. టెస్టులలో 150 స్కోరు చేశాను.. కానీ, వన్డేల్లో పెద్దగా పరుగులు చేయలేదు. నాలుగు వన్డేల్లోను తక్కువ పరుగులకే ఔటయ్యాను. దీంతో ధోని నన్ను తుది జట్టునుంచి తప్పించాడు. ఆ సమయంలో తాను మానసికంగా చాలా కుంగిపోయా. అప్పుడే ఫిక్స్ అయ్యా.. వన్డేలకు రిటైర్మెంట్ చెప్పేసి కేవలం టెస్టులు ఆడదామని నిశ్చయించుకున్నా. అదే విషయం సచిన్ కు చెప్పా. కానీ సచిన్ నన్ను వారించాడు”. టెండూల్కర్ నాతో.. “ఇది నీ కెరీర్ లో ఒక కఠిన దశ. కొన్నాళ్లు ఆగు. ఓపిక పట్టు. ఇంటికెళ్లి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకో. బాగా ఆలోచించు. అప్పుడు రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకో..” అని చెప్పాడు. “అందుకే ఓపిక వేచి చూశా. అదృష్టవశాత్తు నేను తిరిగి ఫామ్ లోకి వచ్చాను. రిటైర్మెంట్ నిర్ణయం మానుకున్నాను” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
“I wanted to retire from ODIs after Dhoni dropped me but Tendulkar stopped me at that time. He said ‘this is a bad phase of your life. Just wait, go back home after this tour, think hard, then decide what to do next’. Luckily I didn’t announce my retirement at that time.”
Sehwag pic.twitter.com/Mn8EwD06ge
— Cricketopia (@CricketopiaCom) June 1, 2022
ఇది కూడా చదవండి: Sourav Ganguly: వీడియో: భార్యతో కలిసి డాన్స్ ఇరగదీసిన గంగూలీ!
2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. శ్రీలంకతో కలిసి ట్రై సిరీస్ ఆడింది. ఆ సిరీస్ లో నాలుగు మ్యాచులు ఆడిన సెహ్వాగ్.. 6, 33, 11, 14 స్కోర్లు చేశాడు. రెండు మ్యాచులు గ్యాప్ ఇచ్చి తిరిగి అవకాశమిచ్చినా వీరూ అదే రీతిలో ఔటై పెవిలియన్ చేరాడు. ఆ సిరీస్ ను భారత్ చేజిక్కించుకున్నా.. వీరూ బ్యాటింగ్ తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ సెహ్వాగ్ ఫామ్ అందుకుని వన్డే ప్రపంచకప్ తో పాటు 2013 వరకు భారత జట్టు తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు.
From 36 all out in Adelaide ,the grit in Melbourne, resilience in Sydney but the highlight for me was such an inexperienced Indian side beating Australia at the Gabba. @RishabhPant17 , Gill , @imShard , Sundar were the heroes.
Experience nahi tha but #BandoMeinThaDum @VootSelect pic.twitter.com/hXSsWqaoKy— Virender Sehwag (@virendersehwag) June 1, 2022