విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక అద్భుతమైన ఆటగాడు. ఇక కోహ్లీ కెప్టెన్ గా టీమిండియాకి అందించిన విజయాలు కూడా ఎవ్వరూ మరిచిపోలేనివి. కానీ.., కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోకపోవడమే అతని కొంప ముంచింది. ఈ నేపథ్యంలో టీ-20, వన్డే ఫార్మేట్ లకి కెప్టెన్ గా తప్పుకున్న కోహ్లీ.. తాజాగా టెస్ట్ లకి కూడా కెప్టెన్సీ వదులుకున్నాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే.. టెస్ట్ లలో మరే భారత కెప్టెన్ కి లేని రికార్డ్ కోహ్లీకి ఉంది. అలాంటి ఆటగాడు ఒక్కసారిగా కెప్టెన్సీని వదులుకోవడమే ఇప్పుడు పెద్ద చర్చకి కారణం అవుతోంది. అసలు కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్నాడా? తప్పుకునేలా చేశారా అన్న వాదన తెరపైకి వచ్చింది.
సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్ అయిన దగ్గర నుండే కోహ్లీకి కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. దాదా ముందుగా తనకి ఆప్తుడైన కుంబ్లేని టీమిండియా కోచ్ గా నియమించాలి అనుకున్నాడు. కానీ.., కోహ్లీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని రవిశాస్త్రికి అవకాశం వచ్చేలా చక్రం తిప్పాడు. కోహ్లీ-శాస్త్రి కాంబోలో టీమిండియా అద్భుతమైన విజయాలను అందుకున్నా.. కోహ్లీ-గంగూలీ మధ్య గ్యాప్ అలాగే ఉండిపోయింది.
ఇవి కూడా చదవండి:
విరాట్ కోహ్లీ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే రజిని ఎమోషనల్
టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. కొత్త కెప్టెన్ అతనే!
టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడం, టీ-20 వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన ఇవ్వడంతో కోహ్లీ-శాస్త్రిపై ప్రజెర్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే విరాట్ ఫామ్ కోల్పోయాడు. అప్పటికే కోహ్లీ టీ-20 కెప్టెన్సీ నుండి తప్పుకున్నా.., అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుండి కూడా తప్పించారు. ఈ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు కూడా కోహ్లీ ఫ్యాన్స్ కి నచ్చలేదు. కానీ.. టెస్ట్ లలో కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ ఉండటంతో ఎవ్వరూ అతన్ని కదిలించే సాహసం చేయలేకపోయారు. దీనికి తోడు.. టెస్ట్ కెప్టెన్ గా బీసీసీఐ దగ్గర ఆప్షన్స్ కూడా లేకుండా పోయాయి. రోహిత్ కి ఫిట్నెస్ ప్రాబ్లెమ్, రాహుల్ కి అనుభవం లేకపోవడం, పంత్ ఇప్పుడిప్పుడే టీమ్ లో నిలదొక్కుకుంటూ ఉండటంతో టెస్ట్ లలో కోహ్లీ సారధ్యం మరికొన్ని ఏళ్ళు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు కోహ్లీ స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం వెనుక బీసీసీఐ పెద్దల హస్తం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
డబ్ల్యూటీసీ పాయింట్స్ ప్రకారం టీమిండియా ఇప్పుడు అంత మెరుగైన స్థానంలో లేదు. ఈ లెక్కన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి ఇండియా క్వాలిఫై అవ్వడం కష్టమనే చెప్పుకోవాలి. ఒకవేళ ఆ కప్ కూడా చేజారితే.. దానిని కూడా కోహ్లీ అకౌంట్ వేయడానికి బీసీసీఐ సిద్ధంగా ఉండొచ్చు. ఈ అవమానాలను, అనుమానాలను ఎదుర్కోలేకే కోహ్లీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవడానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.