విరాట్ కోహ్లీని కెప్టెన్.. కెప్టెన్ అంటూ పిలిచి.. పిలిచి.. అతని మారు పేరు ‘రన్ మెషిన్’ ప్రస్తావించడం మర్చిపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కెప్టెన్ కాగా ముందు.. పరుగుల యంత్రంగా విరాట్ కోహ్లీకి పేరుండేది. సారథిగా బరువు బాధ్యతలు పెరిగి జట్టుపై, ప్రత్యర్థిపై, వ్యూహాలపై ఎక్కువగా పోకస్ పెట్టాడు కోహ్లీ. దీంతో అతని బ్యాటింగ్ మాట్లాడుకోవడం తగ్గించారు క్రికెట్ నిపుణులు. అనేక రికార్డులకు నెలవైన కోహ్లీ.. ప్రస్తుతం కేవలం టెస్టు జట్టుకు మాత్రమే కెప్టెన్ కావడంతో అతని కొంత భారం తగ్గినట్లు అయింది. మళ్లీ ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం ఉంది.
ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో కోహ్లీ బ్యాటింగ్‌ను ఒక సారి పరిశీలిస్తే.. అమోఘమైన రికార్డ్ అతని సొంతం. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఆఫ్రికాలో ఐదు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ (1161) ఉన్నాడు. రెండో స్థానంలో ది వాల్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ద్రావిడ్ 11 మ్యాచ్‌లు ఆడి 22 ఇన్నింగ్స్‌ల్లో 624 పరుగులు చేశాడు.
కోహ్లీ రాబోయే టెస్టు సిరీస్‌లో 66 పరుగులు చేసిన వెంటనే రాహుల్ ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. కోహ్లీ 9 పరుగులు చేసిన వెంటనే వీవీఎస్ లక్ష్మణ్ 566 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇలా ద్రావిడ్ రికార్డ్‌ను బ్రేక్ చేయడం ద్వారా ద్రావిడ్ ప్లేస్‌ను కోహ్లీ ఆక్రమించుకోనున్నాడు. మరి కోహ్లీ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.