‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో భారత్ మంచి శుభారంభం లభించలేదు. దాయాదుల పోరులో పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. క్రికెట్ అభిమానులకు చేదు వార్తే అయినా కూడా అభిమానులు ఎవ్వరూ నమ్మకాన్ని కోల్పోలేదు. అందరూ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. పాకిస్తాన్ ప్రదర్శనను కూడా తక్కువ చేయడానికి లేదు. వారు మొత్తం సమిష్టిగా రాణించారు. పిచ్ కూడా భారత్‌కు కాస్త తలనొప్పిగానే మారింది. మొదట బౌలింగ్‌కు తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలించడంతో భారత్‌కు పరిస్థితి కష్టంగా మారింది. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు కింగ్ కోహ్లీ ఆశ్యర్యపోయారు. రోహిత్ శర్మను ఎందుకు సెలెక్ట్ చేశారు అనే కోణంలో ప్రశ్నించారు.
జర్నలిస్టు ప్రశ్నకు కోహ్లీకి బాగా కోపం వచ్చింది. ఇషాన్ కిషన్ వార్మప్‌లో బాగా ఆడాడు కదా? అతడిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని ప్రశ్నించగా.. కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ‘ మేము ఇది మంచి టీమ్ అని సెలెక్ట్ చేశాం. మీరు చెప్పండి లేదంటే. రోహిత్ శర్మను అంతర్జాతీయ టీ20ల నుంచి తొలగిస్తారా? గత మ్యాచ్‌లో ఎలా ఆడాడో మీకు తెలుసా? అసలు ఆ ప్రశ్న ఎలా అడిగారు. నమ్మలేకపోతున్నా. మీకు కాంట్రవర్సీ కావాలంటే ముందే చెప్పండి నేను అలాగే సమాధానమిస్తాను’ అంటూ కింగ్ కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అలాంటి ప్రశ్న రాగానే కోహ్లీ ముందు బాగా నవ్వుకున్నాడు. మరోవైపు ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.
“Will you drop Rohit Sharma from T20Is?” 🤔@imVkohli had no time for this question following #India‘s loss to #Pakistan.#INDvPAK #T20WorldCup pic.twitter.com/sLbrq7z2PW
— ICC (@ICC) October 25, 2021