విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్ ఆఫ్ టీమిండియా.. రన్ మెషీన్. మైదానంలో పాదరసంలా కదిలే అద్భుతమైన ఫీల్డర్. మహేంద్రసింగ్ ధోని తర్వాత మూడు ఫారెట్లలో జట్టు పగ్గాలు అందుకుని టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. బ్యాటింగ్‌పై పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు టీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు టీ20 వరల్డ్ కప్ 2021 కంటే ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సూపర్ 12 దశలోనే నిష్ర్కమించడంతో సోమవారం నమీబియాతో జరిగే మ్యాచే విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా చివరి టీ20 మ్యాచ్. కెప్టెన్‌గా భారత టీ20 జట్టుకు కోహ్లీ అందించిన సేవలు అనేకం. వాటిలో కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
2017లో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ 49 మ్యాచ్‌లలో 29 విజయాలు సాధించాడు. కేవలం 16 మ్యాచ్‌లలో టీమిండియా ఓడింది. 2 మ్యాచ్‌లు టై కాగ, 2 మ్యాచ్ ఫలితం రాలేదు. 63.82 విన్నింగ్ పర్సంటేజ్‌తో ధోని కంటే ముందున్నాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. వ్యక్తిగతంగానూ విరాట్‌కు టీ20ల్లో తిరుగులేని రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 87 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 25 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 50.05 యవరేజ్‌తో 3227 పరుగులు సాధించాడు. అందులో 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఇంటికొచ్చినా ఆ రికార్డులు మన పేరిటే