టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎంత క్రమశిక్షణగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాడిగా కొన్ని ఏళ్ల పాటు అతన్ని చూసిన క్రికెట్ అభిమానులను అడిగితే కూడా చెప్తారు ఈ విషయం. అలాగే టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో కూడా అందరికి తెలిసిందే. ఇలా రెండు భిన్న ధృవాలుగా ఉన్న వీరిమధ్య సాన్నిహిత్యం ఎలా ఉంటుందో అని ద్రావిడ్ టీమిండియా కోచ్‌గా రావడానికి ముందు అంతా భావించారు.
ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ద్రావిడ్, కోహ్లీ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో కోచ్‌గా ద్రావిడ్ సూచనలను కెప్టెన్ కోహ్లీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విరాట్ కోహ్లీ రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశానికి రావాల్సి ఉంది. కానీ కోహ్లీ రాలేదు. ద్రావిడ్ ఈ సమావేశానికి వచ్చాడు. దీంతో విలేకరులు కోహ్లీ ఫామ్‌లో లేడు కాబట్టే మీడియా సమావేశానికి రాలేదా? అని ప్రశ్నించారు. దీనిపై ద్రావిడ్ వివరణ ఇస్తూ.. అదేం లేదని, నేనే తనని ఏ విధమైన మీడియా సమావేశాల్లో పాల్గొనవద్దని చెప్పినట్లు వెల్లడించారు.
New year, same motivation. pic.twitter.com/25PNy69kGJ
— Virat Kohli (@imVkohli) January 2, 2022
దానికి ఒక కారణం ఉన్నట్లు పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరగబోయే మూడో టెస్టు కోహ్లీకి వందో టెస్టు కానుందని.. దాన్ని ప్రత్యేకంగా ఉంచేలా.. ఆ మ్యాచ్‌కి ముందు కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతాడని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఇలా ద్రావిడ్ పెట్టిన కండీషన్‌ను విరాట్ కోహ్లీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. మరి కోహ్లీ, ద్రావిడ్ మధ్య సాన్నిహిత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రపంచ రికార్డుకు ఏడు అడుగుల దూరంలో విరాట్ కోహ్లీ