భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ఆరంభం ఇచ్చినా.. దాన్ని బిగ్ స్కోర్‌గా మలచలేకపోయారు. ధావన్ 29 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. మహరాజ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.
కాగా విరాట్ కోహ్లీ తన మొత్తం కెరీర్‌లో ఒక స్పిన్నర్ బౌలింగ్‌లో డకౌట్ అవ్వడం ఇదే తొలి సారి. మొత్తం 5 బంతులు ఆడిన కోహ్లీ పరుగులు చేయకుండా అవుట్ అయ్యాడు. కాగా అన్ని ఫార్మాట్లలలో కలిపి కోహ్లీ 31 సార్లు డకౌట్ అయ్యాడు. అత్యధికంగా 34 సార్లు సచిన్ డకౌట్ అయ్యాడు. తర్వాతి స్థానంలో కోహ్లీ, సెహ్వాగ్ ఉన్నారు. మరి కోహ్లీ డకౌట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీపై కఠిన చర్యలకు సిద్ధమైన గంగూలీ!
Virat Kohli’s ODI scores since January 2021:
56
66
7
51
0 – todayFollow #SAvIND 👉 https://t.co/vHcXfh5siJ pic.twitter.com/XK4iL81s3z
— ESPNcricinfo (@ESPNcricinfo) January 21, 2022