Virat Kohli: చూడముచ్చటైన సెలెబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్కల జంట ఒకటి. అభిమానులు ఈ జంటను ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తుంటారు. 2017లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు ‘వామిక’ అని పేరు పెట్టుకున్నారు. అటు విరాట్‌కు కావచ్చు, ఇటు అనుష్క శర్మకు కావచ్చు.. ఫ్యామిలీ మొదటి ప్రాధాన్యం. ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. దాన్ని పర్సనల్ లైఫ్ వరకు తీసుకురారు. పర్సనల్ లైఫ్‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మర్చిపోరు. విరాట్ క్రికేట్‌తో.. అనుష్క సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త విరామం దొరికితే దాన్ని ఇద్దరూ కలిసి సంతోషంగా గడిపేస్తారు.
తాజాగా, ఇద్దరికీ విరామం దొరికిన నేపథ్యంలో ఈ జంట వేకేషన్‌కు వెళ్లిపోయింది. మొన్నీ మధ్య వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. అయితే, వెకేషన్‌కు ఎక్కడుకు వెళ్లారు అనేది మాత్రం తెలియలేదు. బుధవారం వెకేషన్‌కు సంబంధించి భర్త విరాట్‌తో దిగిన ఓ ఫొటోను అనుష్క తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వెకేషన్‌లుక్‌లో ఇద్దరూ అద్భుతంగా ఉన్నారు. విరాట్ బ్లాక్ స్లీవ్‌లెస్ టీషర్టులో.. అనుష్క బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ ష్కర్టులో టూ పీస్ నెక్‌లెస్‌తో అందంగా కనిపిస్తున్నారు.
కాగా, విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి ఆటలో ఆశించిన స్థాయి ప్రదర్శనను కనబర్చటం లేదు. మొన్నటి ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనను కనబర్చారు. సౌత్ ఆఫ్రికా టెస్ట్ నేపథ్యంలో విరాట్ వెకేషన్‌లో విశ్రాంతి తీసుకుని, నూతన ఉత్సాహంతో ఇండియాకు తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తిరిగి వచ్చిన తర్వాత మంచి పదర్శనను కనబర్చాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి, విరాట్, అనుష్కల వెకేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Shadab Khan: పాకిస్థాన్ అంటేనే చెత్త ఫీల్డింగ్. కానీ.. ఆ జట్టులో కూడా ఒక జాంటీ రోడ్స్ ఉన్నాడు!