ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో గంటకు 150 కీ.మీ.పైగా వేగంతో బంతులేస్తూ ప్రత్యర్తి బ్యాటర్లను దడదడలాడించిన సంగతి తెలిసిందే. దిగ్గజ ఆటగాళ్లు సైతం.. ఉమ్రాన్ వేసే స్పీడ్ కు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు. ఐపీఎల్-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శనతో ఉమ్రాన్ ఒక్కసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్.. ఆదివారం జరగబోయే రెండో టీ20లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
మొన్న కేఎల్ రాహుల్.. నేడు రిషబ్ పంత్.. ఇలా ఒక్కక్కరుగా టీమిండియా బ్యాటర్లు ఉమ్రాన్ మాలిక్ దెబ్బకు బ్యాట్లు విరగ్గొట్టుకుంటున్నారు. కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్ తో కూడిన సౌతాఫ్రికా పేస్ దళం బలంగా ఉండడంతో.. అలాంటి పేస్ తో ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియా బ్యాటర్లకు ఉమ్రాన్ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ప్రాక్టీసు సెషన్లో కేఎల్ రాహుల్ కు బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. గంటకు 163 కీ.మీ. వేగంతో బంతులు విసిరి ఔరా అనిపించాడు. ఇది మరవకముందే.. టీమిండియా యువ క్రికెటర్, ప్రస్తుత సిరీస్ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాట్ విరగ్గొట్టాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా వెలుగులోకి..
ఇక.. ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమినా ఉమ్రాన్ మాలిక్.. రెండో టీ20లో బరిలోకి ఖాయంగా కనిపిస్తోంది. తొలి టీ20లో దారుణంగా విఫలమైన.. అన్వేష్ ఖాన్, హర్షల్ పటేల్ లలో ఒకరిని తప్పించి.. ఉమ్రాన్ కు చోటివ్వాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక.. ప్రొటిస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జూన్ 12న (ఆదివారం) కటక్ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ ను 1-1 తో సమం చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలోతెలియజేయండి.
ఎప్పటికైనా సరే #𝐁𝐞𝐥𝐢𝐞𝐯𝐞𝐈𝐧𝐁𝐥𝐮𝐞 💙
ఆటలో గెలుపోటములు సహజమే 😊
తిరిగి పుంజుకుని Paytm T20I ట్రోఫీని గెలవటమే లక్ష్యంగా వస్తుంది #TeamIndia 😎
మరి మీరు మీ విషెస్ ను సెండ్ చెయ్యండి 👇🏻
చూడండి #INDvSA 2nd T20I 12 జూన్ 6pm నుంచి
మీ #StarSportsTelugu / Disney + Hotstar లో pic.twitter.com/j1YLHFELcr— StarSportsTelugu (@StarSportsTel) June 9, 2022