టీమిండియా స్టార్ ప్లేయర్, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. అలాగే టీ20ల్లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా ధావన్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఈ ఘనత సాధించాడు.
ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(1132) ఫోర్లతో ఉన్నాడు. రెండో స్థానంలో అలెక్స్ హేల్స్(1054 ఫోర్లు), మూడో స్థానంలో డేవిడ వార్నర్(1005 ఫోర్లు) నాలుగో స్థానంలో ఆరోన్ ఫించ్(1004 ఫోర్లు) ఉన్నారు. ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. ధావన్ తర్వాత విరాట్ కోహ్లి(917) ఫోర్లతో రెండో ప్లేస్‌లో, రోహిత్ శర్మ (875)ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నారు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ అమ్మాయినే చూడగానే ప్రపోజ్ చేశాను.. కానీ!
Shikhar Dhawan creates history!#IPL2022https://t.co/h72aUaNWV4
— WION (@WIONews) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.