క్రికెట్ లో నువ్వానేనా లాంటి మ్యాచులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలి. మనం చేసే చిన్నచిన్న తప్పిదాల మ్యాచ్ ఓడిపోవడానికి, ఇంకా చెప్పాలంటే కప్పు చేజార్చుకోవడానికి కారణం కావచ్చు. ఇప్పుడు ఆసియాకప్ లోనూ అలాంటి సంఘటనే జరిగింది. లడ్డు లాంటి క్యాచ్ ని సిక్స్ గా మార్చేశారు. దీనిపై ట్రోల్స్ అన్నీఇన్నీ కావు. పాక్ క్రికెటర్లని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో శ్రీలంక-పాకిస్థాన్ తలపడ్డాయి. లంక జట్టుపై ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. పాక్ గెలిచేస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని స్వీయ తప్పిదాలు చేయడంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త చేజేతులా ఓడిపోయింది. ఇక పాక్ ఫీల్డర్స్ క్యాచ్ వదిలేయడం అయితే మ్యాచ్ కే హైలెట్. దీని గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. శ్రీలంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్ కి దిగిన భానుక రాజపక్స.. లంకని రేసులో నిలబెట్టాడు. 18 ఓవర్ చివరి బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ దగ్గరున్న అసిఫ్ అలీ క్యాచ్ కి రెడీ అయిపోయాడు. చేతిలో పడటమే లేటు. సరిగ్గా ఇదే సమయానికి తాను కూడా క్యాచ్ పట్టేద్దామనుకుని, పక్కనుంచి దూసుకొచ్చిన షాదాబ్ ఖాన్.. అలీని ఢీ కొట్టాడు. దీంతో చేతిలో పడిన బంతి కాస్త, బౌండరీ లైన్ అవతల పడింది. సిక్స్ అయిపోయింది. ఒకవేళ పాక్ ఫీల్డర్ ఆ క్యాచ్ పట్టుంటే లంక స్కోరు కాస్త తగ్గేది. పాక్ కప్పు గెలిచే అవకాశముండేది. దీనిపై స్పందించిన నెటిజన్స్.. ఫీల్డింగ్ విషయంలో పాక్ మారదా అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలానే క్యాచ్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్స్ వీడియోని షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత క్యాచ్ మిస్ చేయడానికి కారణమైన షాదాబ్ ఖాన్ క్షమాపణ కూడా చెప్పాడు. ఈ ఓటమికి బాధ్యత తనదేనని అన్నాడు. మరి పాక్ పూర్ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి. ఇదీ చదవండి: ఆసియా కప్ ఫైనల్లో పాక్ చిత్తు.. ఆరోసారి కప్ ను ముద్దాడిన లంక! ये छक्का क्रिकेट इतिहास में हमेशा याद रखा जाएगा. pic.twitter.com/yunCTCBufY — उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 11, 2022 Catches win matches. Sorry, I take responsibility for this loss. I let my team down. Positives for team, @iNaseemShah, @HarisRauf14, @mnawaz94 and the entire bowling attack was great. @iMRizwanPak fought hard. The entire team tried their best. Congratulations to Sri Lanka pic.twitter.com/7qPgAalzbt — Shadab Khan (@76Shadabkhan) September 11, 2022