భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆట నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సానియా మాట్లాడుతూ, ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను మొత్తం సీజన్లో ఆడగలనో లేదో తెలియదు. కానీ, నేను మొత్తం సీజన్లో ఉండాలనుకుంటున్నాను’ అన్ని అన్నారు.
JUST IN: Sania Mirza to retire from professional tennis after the current season.#SaniaMirza #tennis pic.twitter.com/5XVBoUvz6a
— TOI Sports (@toisports) January 19, 2022
సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5)తో ఓడిపోయారు. అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్‌లో పాల్గొంటుంది. మరి సానియా రిటైర్మెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘I’ve decided this will be my last season. I’m taking it weeky by week, not sure if I can last the season, but I want too.” @MirzaSania #AusOpen
— Prajwal Hegde (@prajhegde) January 19, 2022