మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గేల్, వార్నర్.. ఇలా ఎంత మంది స్టార్స్ ఉన్నా.. మిస్టర్ ఐపీఎల్ అని మాత్రం ఒక్క సురేష్ రైనాని మాత్రమే పిలుస్తారు. ఐపీఎల్ చరిత్రలో సురేష్ రైనా ప్రస్థానం అలాంటిది. ఐపీఎల్ లో మొదటి సీజన్ నుండి రైనా చెన్నై జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. రైనా తన అద్భుతమైన ఆట తీరుతో చెన్నై జట్టుకి చాలానే విజయాలను అందించాడు. బ్యాటింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లోను విన్యాసాలు చేయగల సమర్థుడు. కేవలం ఒకే ఒక్క సీజన్ లో మాత్రమే గుజరాత్ లైన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు రైనా. అది కూడా.. ఆ సీజన్ లో చెన్నై పై అనర్హత వేటు పడటంతోనే. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 205 మ్యాచ్ లు ఆడిన రైనా.. 137 స్ట్రైక్ రేట్ తో మొత్తం 5528 పరుగులు సాధించాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సీఎస్కే జట్టుని రైనా బలంగా నమ్మాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ ధోనిని తన రోల్ మోడల్ గా భవిస్తూ వచ్చాడు. ధోని ఏది చెప్తే అది చేస్తూ.. ‘చిన్న తలైవా ‘అని పేరు తెచ్చుకున్నాడు. కానీ.., ఇంత సాధించినప్పటికీ ప్రస్తుతం(2022) మెగా వేలంలో రైనా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. మరి.. దీనికి కారణం ఎవరు? ధోనిని నమ్మి రైనా మోసపోయాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ పాలసీ ప్రకారం ధోని, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఋతురాజ్ గైక్వాడ్ ని అంటి పెట్టుకుంది. ఈ సమయంలో ధోని కాస్త గట్టిగా చెప్పి ఉంటే చెన్నై జట్టు రైనాని తమతోనే ఉంచుకునేది. కానీ.., మహీ అలా చేయలేదు. అయినప్పటికీ రైనా.. ధోనిపై నమ్మకాన్ని కోల్పోలేదు. మెగా ఆక్షన్ లో మహీ భాయ్ తనని మళ్ళీ సీఎస్కే జట్టులోకి వచ్చేలా చేస్తాడు అన్నది రైనా నమ్మకం. ఇందుకోసమే రైనా ఎవ్వరిని సంప్రదించలేదు. కానీ.., మొదట నుండి రైనాని వయసు అయిపోయిన ఆటగాళ్లు అంటే నచ్చరు. టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో ధోని ఇదే సూత్రాన్ని అనుసరించి సీనియర్స్ ను ఇంటికి సాగనంపాడు. ఇప్పుడు రైనాని కూడా ధోని అలానే వదిలించుకున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చాలా ఏళ్లుగా సీఎస్కే జట్టుతోనే కొనసాగుతూ వస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ని కూడా చెన్నై జట్టు పట్టించుకోలేదు. ప్రస్తుతం అతని వయసు 37 సంవత్సరాలు. ఈ కారణంగానే ధోని ఈ స్టార్ ఓపెనర్ ని కూడా వదిలించుకున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తననే నమ్ముకున్న సురేష్ రైనా విషయంలో చెన్నై యాజమాన్యం, కెప్టెన్ ధోని ఇలా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
CSK to Suresh Raina-#IPLAuction #Raina pic.twitter.com/BxPyTb44jN
— Abhishek (@Ingenuity402) February 12, 2022