టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ ఫార్మెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మెట్లపై పూర్తి దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జడేజా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న విషయం స్వయంగా అతని సహచర ఆటగాడు మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలికి సర్జరీ అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇక టెస్టులకు పూర్తిగా దూరమై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్‌లో 57 మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2195 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
According to reports, Ravindra Jadeja has been ruled out of the South Africa tour due to a injury.#India #SouthAfrica #SAvIND pic.twitter.com/GMam1zMGaY
— Sportskeeda (@Sportskeeda) December 8, 2021
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా