టీమిడింయా హెడ్ కోచ్ రవిశాత్రితో తనకున్న ఒక చేదు అనుభవాన్ని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పంచుకున్నాడు. 2019 ఆస్ట్రేలియా టూర్ సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో రవిశాస్త్రి చెప్పిన మాటలు నన్ను ఎంతో బాధించాయంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అశ్విన్ వాపోయాడు. అంతేకాదు రవిశాస్త్రి మాటలు తనను బస్సు కింద తోసేసినట్లు అనిపించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘2019 ఆస్ట్రేలియా టూర్ లో సిడ్నీ వేదికగా కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసిన మాట వాస్తవమే. నేను ఆ ఘనత సాధించలేక పోయాను. ఆ సమయంలో రవిశాస్త్రి అన్న మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. నేను మనస్ఫూర్తిగా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయాను. మనం మాటలు అనేస్తుంటాం. కొన్నిసార్లు వాటిని వెనక్కి తీసుకుంటాం. ఆ మాటలు విన్నప్పుడు నన్ను ఒక బస్సు కింద తోసేసిన ఫీలింగ్ వచ్చింది. రవిశాస్త్రి అంటే నాకు గౌరవం ఉంది. కానీ, ఆ మాటలను జీర్ణించుకోలేక పోయాను’ అంటూ రవిచంద్రన్ అశ్విన్ వాపోయాడు.
Ravichandran Ashwin is averaging less than 𝟏𝟗 since that Ravi Shastri statement 🔥
[Via: ESPNcricinfo] pic.twitter.com/k7yLmLHJ0v
— Sport360° (@Sport360) December 21, 2021
అప్పుడు ఆ మాటలు అన్నందుకు కచ్చితంగా రవిశాస్త్రి ఇప్పుడు బాధపడుతూ ఉండచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అశ్విన్ సౌతాఫ్రికా టూర్ లో స్థానం సంపాదించాడు. కుల్దీప్ యాదవ్ మాత్రం చాలా రోజులుగా ఫామ్ లేకుండా టీమ్ లో స్థానం కోల్పోయాడు. అంతేకాదు సౌతాఫ్రికా టూర్ కోసం కనీసం కుల్దీప్ ను సెలక్టర్లు కనీసం పరిగణించలేదు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్తిర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I felt crushed: R Ashwin recalls Ravi Shastri calling Kuldeep Yadav India’s No.1 overseas spinner.
Karishma with details#RAshwin #RaviShastri #KuldeepYadav pic.twitter.com/9iFwGsF8pW
— TIMES NOW (@TimesNow) December 21, 2021