క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఫీట్ నమోదైంది. ఇప్పటివరకు టీ20లు, వన్డేలకు పరిమితమైన ‘ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌ల’ రికార్డు.. ఇప్పుడు టీ10 లీగ్ లో చోటుచేసుకుంది. పుదెచ్చేరీ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో పాట్రియోట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణ పాండే రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
పుదెచ్చేరీ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో భాగంగా శనివారం రాయల్స్ వర్సెస్ పేట్రియాట్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో.. నితీష్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన కృష్ణ పాండే .. టీ10 క్రికెట్‌లో ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.. పాండే కేవలం 19 బంతుల్లోనే 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయితే ఆనూహ్యంగా పేట్రియాట్స్ ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగల్గింది.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
He has done the unthinkable! #KrishnaPandey shows what’s possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW
— FanCode (@FanCode) June 4, 2022
ఇది కూడా చదవండి: Deepak Chahar: ‘హనీమూన్ లో ఎలా నడుచుకోవాలో’.. దీపక్ చాహర్ కు సోదరి బోల్డ్ ఉపదేశం!
ఇక టీ20ల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారిగా ఈ ఫీట్‌ను సాధించాడు. అదే విధంగా శ్రీలంకతో జరగిన టీ20లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కూడా ఈ అరుదైన ఫీట్ సాధించాడు. అయితే టీ10 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా పాండే నిలిచాడు. మరి.. యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన.. ఈ యువ క్రికెటర్ చేరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.