టెస్టు క్రికెట్లో 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసిన జట్టు కచ్చితంగా భారీ స్కోర్ సాధించడం సర్వసాధారణం. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అవ్వదు. అదే అద్భుతాన్ని చేసి చూపించారు ఆసీస్ బౌలర్లు.. ప్యాట్ కమిన్స్, మిచ్చెల్ స్టార్క్. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న టెస్టులో 248/3తో పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్థాన్ జట్టును 268 పరుగులకు కుప్పకూల్చారు.
ఆసీస్ పేస్ దెబ్బకు పాకిస్థాన్ జట్టు కేవలం 20 పరుగలకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్క్ 4 వికెట్లు, కమిన్స్ 5 వికెట్లు పడగొట్టారు. పాక్ టాప్ ఆర్డర్ రాణించినప్పటికీ మిడిల్, లోయర్ ఆర్డర్ దారుణంగా చేతులెత్తేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, కెప్టెన్ బాబర్ ఆజమ్, అజహర్ అలీ అర్ధ శతకాలతో రాణించారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. మరి పాకిస్థాన్ బ్యాటింగ్‌పై, ఆసీస్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారత్ పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు!
Unreal collapse bc#PAKvsAUS pic.twitter.com/IzMpMs8T1j
— Suleman Ali (@Sulemanali_07) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.