క్రికెట్ లో పాకిస్థాన్ టీమ్ అంటే అనిశ్చితికి మారు పేరు. ఒక్కోసారి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలను సైతం అవలీలగా ఓడించే ఈ టీమ్.. కొన్నిసార్లు పసికూనల చేతిలో ఘోరంగా ఓడిపోతూ ఉంటుంది. ఇక పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో పడుతున్న సింపుల్ క్యాచ్ లను కూడా నేలపాలు చేసి.. మ్యాచ్ లు ఓడిపోవడంలో వీరితో ఎవ్వరూ పోటీ పడలేరు. అయితే.. గత కొంత కాలంగా పాకిస్థాన్ టీమ్ అప్రోచ్ లో మార్పు వచ్చింది. బాబర్ అజామ్ కెప్టెన్ అయ్యాక ఈ అనిశ్చితి నుండి బయటపడ్డా.. ఫీల్డింగ్ విషయంలో మాత్రం ఆ జట్టు ఇంకా వీక్ గానే ఉంది. కానీ.. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ బుధవారం ఈ రెండు జట్ల మధ్య ముల్తాన్ వేదికగా తొలి వన్డే జరిగింది. ఈ హయ్యెస్ట్ స్కోరింగ్ మ్యాచ్‌లో విండీస్ జట్టును పాకిస్థాన్ అయిదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ సెంచరీ సాధించగా, అతనికి టాప్ ఆర్డర్ బ్యాటర్ షమారా బ్రూక్స్ 83 బంతుల్లో 70 చక్కని సహకారం అందించాడు. ఈ జోడీని విడతీయడానికి బాబర్ అజామ్ ఎన్ని వ్యూహాలు వేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇక ఇన్నింగ్స్ 30వ ఓవర్ లో బ్రూక్స్ భారీ స్వీప్ షాట్ కి ప్రయత్నం చేయగా, బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని గాలిలోకి లేచింది. నిజానికి సేఫ్ ఏరియాలో ల్యాండ్ అవుతున్న ఆ బంతిని షాదాబ్ ఖాన్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. కొన్ని మీటర్ల దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన షాదాబ్ ఖాన్ ఫుల్ లెంత్ డైవ్ చేసి, కాసేపు గాలిలో ఉండి మరీ, లెఫ్ట్ హ్యాండ్ తో ఆ క్యాచ్ అందుకోవడం విశేషం. నిజానికి ఫీల్డింగ్ లో ఓ పాకిస్థాన్ ప్లేయర్ ఇంతలా మెరవడం అరుదు అనే చెప్పాలి. దీంతో.. ఈ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక.. బాబర్ అజామ్ సెంచరీతో పాకిస్థాన్ ఈ వన్డే మ్యాచ్ లో నెగ్గినా, షాదాబ్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. మరి.. ఓ పాకిస్థాన్ ఆటగాడు జాంటీ రోడ్స్ ని గుర్తుకి తెచ్చేలా ఈ రేంజ్ క్యాచ్ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
UNREAL FROM SHADAB 😱@mnawaz94 gets the breakthrough courtesy a one-handed stunner from @76Shadabkhan! 💥#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/x2IlVnVuJW
— Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022