రూల్ ఇజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్! సూక్తిని తూచా తప్పకుండా పాటించింది.. పాకిస్తాన్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్. చాలా రోజులుగా హోటల్‌లో ఉంటున్న క్రికెటర్ల బుకింగ్ పూర్తి అయిన వెంటనే వారిని మరో మాట లేకుండా ఖాళీ చేయించింది. బుకింగ్ పోడిగింపును మర్చిన పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) కారణంగా పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్లు లగేజ్‌తో సహా రోడ్డుపై పడాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖ్వాయిద్-ఎ-అజామ్ టోర్నీ ఫైనలిస్ట్‌లు ఫన్ఖుత్వా, నార్తరన్ జట్లు క్లబ్ రోడ్డులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్నాయి. ఈ ఆటగాళ్ల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిసెంబర్ 22 వరకు మాత్రమే హోటల్‌ను బుక్ చేసింది. తదపరి బుకింగ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్వాన్స్ చెల్లించలేదు.
అయితే, ముందు చెప్పిటన్లు కాకుండా… జట్టుసభ్యులు సంఖ్య ఎక్కువగా ఉండండంతో మునపటి బుకింగ్‌ను రద్దు చేసిన తరువాతే కొత్త బుకింగ్ చేస్తామని ఆ హోటల్‌కు బోర్డు తెలిపినట్లు సమాచారం. ఆ తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, హోటల్ మేనేజ్‌మెంట్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరుగలేదు. కానీ.. పీసీబీ మాత్రం తమ బుకింగ్‌లను హోటల్ ధృవీకరించబడినట్లు భావించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సమాచార, సమన్వయ లోపం కారణంగా ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లగేజీతో రోడ్డు మీద వేచిచూడాల్సిన దుస్థితి వచ్చింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ పై రేప్ కేసు.. ధృవీకరించిన క్రికెట్ బోర్డు!