‘జార్వో69’ టీమిండియా ఇంగ్లాండ్ టూర్‌లో ఈ పేరు బాగా ఫేమస్ అయ్యింది. క్రికెట్‌పై తనకున్న పాషన్, టీమిండియాపై తనకున్న అభిమానాన్ని సందర్భం దొరికినప్పుడల్లా గ్రౌండ్‌లో ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసి టీమిండియాని కష్టాల్లో గట్టెంక్కించిన జార్వో.. ఓవల్ స్టేడియంలో నాలుగో టెస్టు సందర్భంగా తన బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్లను ఇరకాటంలో పడేశాడు.
ఉమేష్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అతని కంటే ముందు జార్వో పరిగెత్తుకుంటూ వచ్చి తన బౌలింగ్ యాక్షన్‌తో నాన్ స్ట్రైకర్‌ను ఢీ కొట్టాడు. జార్వో వస్తుండగా ఉమేష్ యాదవ్, అంపైర్ అందరూ చూస్తూ నవ్వుకుంటూ ఉండిపోయారు. ఇంగ్లాండ్ అభిమానులతై జార్వోని చీర్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. సోషల్ మీడియాలోనూ జార్వో క్రేజ్ మాములుగా లేదు. కొందరు అభిమానులైతే అశ్విన్ కాదని జార్వోని ఎలా సెలక్ట్ చేశారంటూ ఛలోక్తులు విసిరారు. కొందరు ఇది భద్రతా సిబ్బంది వైఫల్యమంటూ విమర్శిస్తున్నారు.
Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021