T20 Qualifier: క్రికెట్ లో ఎప్పుడు ఎలాంటి గణాంకాలు నమోదు అవుతాయో ఊహించలేము. పసికూన జట్టు అనూహ్య విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన జట్టు చెత్త ప్రదర్శన చేసిన మ్యాచ్ లు ఉన్నాయి. ఇక తాజాగా ఓ జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయ్యి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మలేషియా వేదికగా జరుగుతున్న మహిళా అండర్-19 క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఈ గణాంకాలు నమోదు అయ్యాయి. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో భాగంగా నేపాల్ మహిళల జట్టు శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళల జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు 8.1 ఓవర్లు మాత్రమే ఆడి.. 8 పరుగులకే కుప్పకూలింది. కేవలం 3 పరుగులు చేసిన స్నేహ మహారా ఆ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచిందంటే.. నేపాల్ మహిళల జట్టు ఎంత అధ్వాన్నంగా ఆడిందో అర్ధం చేసుకోవచ్చు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్ స్నిన్నర్ మహిక గౌర్ 4 ఓవర్లులో కేవలం 2 పరుగులు ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టి.. నేపాల్ జట్టు పతనాన్ని శాసించింది. ఇక ఇందుజ (3/6) కూడా తన సత్తా చాటింది. ఇక అతి స్వల్ప లక్ష్యాన్ని యూఏఈ ఏడు బంతుల్లోనే ఛేదించింది. ఈ మొత్తం మ్యాచ్ ఎవ్వరూ ఊహించని విధంగా 9.2 ఓవర్లనే ముగియడం విశేషం. నిజానికి ఈ టోర్నీలో నేపాల్ జట్టు ప్రదర్శన అంత నాసిరకంగా ఏమి లేదు. అంతకుముందు ఆడిన మ్యాచ్ లో ఖతార్ ను ఆ జట్టు 38 పరుగులకే కుప్పకూల్చింది. కానీ.., యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళల బౌలింగ్ దాటికి నేపాల్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ లో పూర్తిగా చేతులు ఎత్తేయడంతో ఈ చెత్త రికార్డు నమోదు అయ్యింది. మరి.. ఒక జట్టు 8 పరుగులకే కుప్పకూలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Krishna Pandey: ‘ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు’.. యువరాజ్ రికార్డు సమం చేసిన పాండిచ్చేరి క్రికెటర్!
🏆 PLAYER OF THE MATCH 🏆
🇦🇪UAE’s left-arm seamer Mahika Gaur is awarded the player of the match for figures of 4-2-2-5.
Her five-wicket haul was instrumental in bowling out Nepal for 8 to seal a 10-wicket win💪🏻#AsiaQualifier #U19WC @ICC pic.twitter.com/hP4ovKjrVt
— Malaysia Cricket (@MalaysiaCricket) June 4, 2022