ఏ రంగంలో అయినా.. తండ్రి కొడుకులు కలిసి ఒకే సమయంలో రాణించడం అనేది చాలా అరుదు. క్రికెట్ లో అయితే ఈ ఫీట్ అసాధ్యమని చెప్పుకోవచ్చు. కానీ.., ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ, అతని కొడుకు విషయంలో మాత్రం ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
షార్జా వేదికగా “సీబీఎఫ్సి -20” క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఇందులో ఆఫ్ఘన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ, తన 16 ఏళ్ల కుమారుడు హసన్ ఇద్దరూ కూడా ఒకే టీమ్ కి కలసి ఆడారు. ప్రస్తుతం నబీ వయసు 37 సంవత్సరాలు. ఈ ఆల్ రౌండర్ ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇంతే కాక ఎక్కడ టీ-20 లీగ్స్ జరిగినా.. నబీ అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు. ఈ నేపథ్యంలోనే నబీ “సీబీఎఫ్సి -20” క్రికెట్ లీగ్ లో పాల్గొన్నాడు. ఇక మహమ్మద్ నబీ కుమారుడు ఇప్పుడిప్పుడే జూనియర్ స్థాయి క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు.తండ్రి ఆట టీవీలో చూసే హసన్ క్రికెటర్ గా మారాలని నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగానే 16 ఏళ్ల హాసన్ గత సంవత్సరం షార్జా క్రికెట్ అకాడమీలో తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో.. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే టీమ్ కి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా.. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మహమ్మద్ నబీ స్పందించాడు.
“హసన్‌కు మంచి ప్రతిభ ఉందని నాకు తెలుసు. అందుకే నేను అతనికి క్రికెట్ ఆడటానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నాను. దానికి తగ్గట్లే అతడు రాణిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లో మేమిద్దరు ఆడాలి అనేది నా కోరిక” అని నబీ తెలియజేశాడు. మరి.. తండ్రిగా మహమ్మద్ నబీ కోరిక తీరుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nabi hopes his 16 year old will make it to Afghanistan dressing room before he retires…at least he will try his best to hold on.https://t.co/Wwo81Km4eN
— CricketNext (@cricketnext) January 22, 2022