టీమిండియా తాజా, మాజీ సారథులు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ విమర్శలు గుప్పించారు. ఆడనప్పుడు వారిని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ సెలెక్టర్లను ప్రశ్నించాడు. ఈ మధ్యకాలంలో.. ఈ ముగ్గురు జట్టుకు అవసరమైన ఏ సందర్భంలోనూ రాణించింది లేదు. అలాంటప్పుడు వీరిని జట్టులో ఎందుకు కొనసాగించాలి. ఇకనైనా.. వీరు ముగ్గురు బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్ ప్రదర్శ జట్టుపై అధికంగా ఉంటుందని, కాబట్టి వీరిద్దరూ ఆటను మెరుగుపరచుకోవాలని సూచించారు.
‘‘కోహ్లీ, రోహిత్ కున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఒత్తిడి సహజం. అయితే, కేవలం దానిని సాకుగా చూపితే సరిపోదు. ఒత్తిడిని అధిగమించి రాణించాలి. టీ20లను వన్డేల్లా ఆడితే సరిపోదు. ఈ విషయంలో కెఎల్ రాహుల్ మరింత మెరుగవ్వాలి. ఒకవేళ టీమ్ మేనెజ్మెంట్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయమని ఆదేశిస్తే అతడు జస్ట్ 60 రన్స్ చేసి నాటౌట్ గా తిరిగొస్తానంటే కుదరదు.. జట్టుకు న్యాయం చేయాలి. వాళ్లకు 150-160 స్ట్రైకు రేటుతో బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. వేగం పెంచాలి. ముఖ్యంగా ఎప్పుడైతే వాళ్లు మెరుగైన స్కోరు సాధించాలని మనం కోరుకుంటామో అప్పుడే చేతులెత్తేస్తున్నారు. అప్పుడు ఒత్తిడి ఇంకాస్త ఎక్కువవుతుంది’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Krishna Pandey: ‘ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు’.. యువరాజ్ రికార్డు సమం చేసిన పాండిచ్చేరి క్రికెటర్!
కాగా, గత కొన్నాళ్లుగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఐపీఎల్ లో సైతం ఘోరంగా విఫలమయ్యారు. ఈ మెగా ఈవెంట్‌లో విరాట్ 341 పరుగులు చేస్తే.. రోహిత్ కేవలం 268 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేగాక రోహిత్ సారథ్యంలోని ముంబై సైతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఘోర వైఫల్యంతో ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగించిన వీరిద్దరూ.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లి, రోహిత్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
16 innings, 341 runs @ 22.73, 2 fifties, and just 8 sixes
Virat Kohli failed to make an impact with the bat in IPL 2022 🫤#ViratKohli #RCB #IPL2022 #Cricket pic.twitter.com/ODq0kXQLdk
— Wisden India (@WisdenIndia) May 31, 2022
Rohit Sharma reflects on some positives for MI from IPL 2022 and promises to come back stronger next season.
@ImRo45 | #RohitSharma | @mipaltan pic.twitter.com/BVZAHjhAE0— MI Fans Army™ (@MIFansArmy) June 2, 2022