ఐపీఎల్ 2022 సీజన్‌లో తెరపైకి వచ్చిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. మన హైదరాబాదీ కుర్రాడే. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఈ తెలుగుతేజం శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు ఆపద్బాంధవుడిగా మారాడు. తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మ్యాచ్‌ను కోల్పోయినప్పటికీ.. ముంబై ఇండియన్స్ స్కోరు 170 పరుగుల వరకు వెళ్లిందంటే దానికి కారణం తిలక్ వర్మే.
మ్యాచ్ అనంతరం.. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తిలక్ వర్మ తన లక్ష్యాలు ఏమిటో వెల్లడించాడు. ‘‘మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా నాన్న చాలీచాలని జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఆ జీతంతోనే నా క్రికెట్ కోచింగ్‌కు అయ్యే ఖర్చులు.. మా అన్న చదువులు వెళ్లదీయాలి. అయితే, గత కొన్నేళ్లుగా కొంతమంది స్పాన్సర్లు ముందుకు రావడం, మ్యాచ్ ఫీజుల రూపంలో డుబ్బు అందడంతో నా ఖర్చులు నేనే చూసుకుంటున్నాను” అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: మ్యాచ్ జరుగుతుండగా లిప్ లాక్‌లో మునిగిపోయిన జంట!“ఇప్పటివరకు తమకు సొంత ఇల్లు లేదని, అద్దెె ఇంట్లో నివసిస్తున్నామని చెప్పాడు. ఐపీఎల్ ఆడటం ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తో ఓ ఇల్లు కొంటానని పేర్కొన్నాడు. సొంత ఇల్లును కొనాలనేది తన తల్లిదండ్రుల కల అని, దాన్ని నెరవేరుస్తానని అన్నాడు. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులు తన జీవితాన్ని మార్చేస్తాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరింత స్వేచ్ఛగా, ఏకాగ్రతగా ఆడటానికి అవకాశాన్ని కల్పిస్తాయని అన్నాడు. సొంత ఇంటిని కొనడంతో పాటు టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లల్లో ఆడటం, ప్రపంచ కప్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం వంటి అనేక లక్ష్యాలు ప్రస్తుతం తన ముందు ఉన్నాయని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
Never Give Up – Tilak Varma 🙏#MumbaiIndians #IPL2022 #TilakVarma pic.twitter.com/R7ixx9l93i
— Oh My Cricket (@OhMyCric) April 3, 2022
“61 ho gaya…ab bas team ko jeetana hai.” 💪
Tilak shares his feelings on his superb knock 💙#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/L7M6ax4LqK
— Mumbai Indians (@mipaltan) April 3, 2022
ఇక తిలక్ వర్మను అభినందిస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ”అదరగొట్టావు తెలుగు కుర్రాడా.. నీ ఆటకు ఫిదా.. సూర్య లేని లోటును తీరుస్తున్నావు.. ఇలాగే ముందుకు వెళ్లు.. త్వరలోనే టీమిండియాలో నిన్ను చూస్తాము.. నీ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతం” అంటూ కామెంట్ చేశారు. ఇక, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్.. మెగా వేలం-2022లో తిలక్ వర్మను కోటీ డెబ్బై లక్షలకు కొనుగోలు చేసింది.
ఇది కూడా చదవండి: దుమ్మురేపిన తెలుగోడు! SRH పై ట్రోలింగ్!