సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీథరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రషీద్ ఖాన్‌ను ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్‌లో (రెమ్యునరేషన్) మేము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రషీద్ ఖాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మురళీథరన్ పై విధంగా స్పందించాడు. “రషీద్ ఎస్‌ఆర్‌హెచ్ కుటుంబంలో మాజీ సభ్యుడు.. అతనిపై ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి కానీ తమ అభిమానులకు కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు.. రిటెన్షన్‌లో రషీద్‌ను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాము.. అయితే అతను అడిగినంత మేం ఇవ్వలేకపోయామంటూ” మురళీథరన్ వివరణ ఇచ్చాడు.
IPL teams have purse of 90 crores and SRH say that they couldn’t afford Rashid freaking Khan,who is the best T20 bowler in the world.
Pic unrelated to the above statement though. pic.twitter.com/HV0eGN1g6B
— Akash Kumar Jha (@Akashkumarjha14) April 11, 2022
ఇది కూడా చదవండి: రషీద్ ఖాన్ ని సన్ రైజర్స్ వదులుకుందా? అతనే వదిలేశాడా?
ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్‌లో రషీద్ ఖాన్ రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలొచ్చాయి. మురళీథరన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్ ఖాన్.. అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన వార్త నిజమేనని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్ వదులుకున్న రషీద్ ఖాన్‌ను ఐపీఎల్ 2022 ఎడిషన్ లో కొత్తగా ఏంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు వెచ్చించి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ రషీద్ ఖాన్‌ను 2017లో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 76 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టి, ఫ్రాంచైజీ తరఫున రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
Rashid Khan is playing against SRH for the first time in IPL 👀#IPL2022 #RashidKhan #KaneWilliamson #OrangeArmy pic.twitter.com/SEkqSvQgI2
— CricTelegraph (@CricTelegraph) April 11, 2022
SRH’s second-highest wicket-taker Rashid Khan is up against his former team in IPL 2022.
📸: IPL/BCCI#SRHvGT | #IPL2022 | #RashidKhan pic.twitter.com/fIaSNlyICA
— CricTracker (@Cricketracker) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.