IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటముల్ని కూడగట్టుకుంటోంది. ఐదో మ్యాచ్‌లోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బుధవారం రాత్రి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. మ్యాచ్‌లో ఓటమి అనంతరం జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మేము ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసినా గెలవలేకపోతున్నాం. మేము మ్యాచ్‌ను బాగా ఆడాం.. కానీ, కీలక సమయాల్లో రన్ అవుట్లు విజయావకాశాలను దెబ్బ తీశాయి. ఏది జరగకూడదని అనుకున్నామో.. అదే జరిగింది. మంచి రన్ రేట్‌ను కొనసాగించినా, చివర్లో ఒత్తిడిని జయించలేకపోయాం.
పరాజయాల్ని చవి చూస్తున్న నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు సిద్ధమయ్యాం. బ్యాటర్లు అద్భుతంగా ఆడారు’’ అని అన్నారు. వరుసగా ఓటమి పాలవుతున్న బాధను తట్టుకోలేక మీడియా ముందు ఒకరకంగా ఏడ్చినంత పనిచేశారు. కాగా, 2013లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక జట్టు ఐదు టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. కానీ, ఐపీఎల్ 2022లో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీనుంచి తప్పుకోవాలంటూ తీవ్ర స్థాయిలో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రోహిత్.. కెప్టెన్సీ నుంచి తప్పుకొని అతన్ని కెప్టెన్ చెయ్: సంజయ్ మంజ్రేకర్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.