ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ డబుల్ హెడర్ మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచులో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఇప్పటికే.. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ అయిపోగా ముంబై ఇండియన్స్ చేజింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో అభిమాని ఒకరు కన్నీరు పెట్టుకోవడం అందరి మనసును కలిచివేస్తోంది.
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్లో 4 పరుగులు మాత్రమే చేసింది. 2వ ఓవర్లో సిక్స్ కొట్టి టచ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ.. అదే ఓవర్ లో 10 పరుగులు వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో, రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సమయంలో స్టేడియంలో ఎంతో ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తున్న అభిమాని రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో అందరి మనసులను కలచివేస్తోంది.
— K I N G (@KingKalyanPK) April 2, 2022
ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 68 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు కెప్టెన్ శాంసన్(30), హెట్‌మైర్(35) పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పొలార్డ్ ఒక వికెట్ సాధించాడు.