భారత్ – సౌతాఫ్రికా టీ20 సిరీస్ సమరానికి అంతా సిద్దమైంది. గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కు టీమిండియా సారధిగా రిషబ్ పంత్ కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ విశ్రాంతి పేరుతో తప్పుకోవడంతో.. కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్లో కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌కి తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించడంపై పెద్ద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో.. బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పుకోమందని.. అది ఇష్టంలేకే రాహుల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కెప్టెన్‌గా కాస్తో కూస్తో మెప్పించిన ఆటగాడు.. కెఎల్ రాహుల్. ఈ సీజన్ లో లక్నోసూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ 15 మ్యాచుల్లో 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. వరుసగా మూడో సీజన్లో 600+ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో.. టీమిండియా రెగులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి పేరుతో దూరమవ్వడంతో.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా రాహుల్ ను నియమించింది బీసీసీఐ. అయితే.. సౌతాఫ్రికా టూర్లో దారుణంగా విఫలమైన రాహుల్ కు మరోసారి కెప్టెన్సీ అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Most Runs As A Captain In IPL 2022. 🏆 🔥 #KLRahul #hardikpandya #FafDuPlessis #SanjuSamson #ShreyasIyer #IPL #IPL2022 pic.twitter.com/5DpFoLgS0Y
— CricCircle (@thecriccircle) June 1, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: ఫామ్‌లో లేక పోయినా.. కింగ్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది!
‘అతనిలో ఏ కోణంలో కెప్టెన్సీ లక్షణాలు కనిపిస్తున్నాయ్..’ అంటూ ఓ బీసీసీఐ అధికారి బహిరంగంగానే కామెంట్ చేశాడు. అవేమి పట్టించుకోని సెలక్టర్లు, స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌కి రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఏం జరిగిందే తెలియదు కానీ, సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయం కారణంగా రాహుల్ తప్పుకున్నాడు. ఈ విషయం క్రీడావర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. కెప్టెన్ గా రాహుల్ మరోసారి విఫలమైతే.. విమర్శల ఎక్కువవుతాయన్న కారణంతో సెలెక్టర్లే కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఇష్టంలేకే.. రాహుల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Get well soon @klrahul pic.twitter.com/xkQrODcPPv
— RVCJ Media (@RVCJ_FB) June 9, 2022
ప్లేయర్లను పక్కనబెట్టడానికి టీమిండియా సెలెక్టర్లు ‘గాయం’ సాకుగా చూపడం కామనని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ఇంతకుముందు కూడా అజింకా రహానే, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లను ఇదే వంకతో పక్కనబెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కెఎల్ రాహుల్ విషయంలో కూడా ఇదే అస్త్రాన్ని వాడారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. రాహుల్ ఇలా ఉన్నపలంగా తప్పుకోవడం.. భారత జట్టుకు పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఇప్పటికే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా.. వంటి ఆటగాళ్లు దూరమవడంతో టీమిండియా బలహీనంగా కనిపిస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A setback for KL Rahul, but he will bounce back 💪 pic.twitter.com/8Cyfw4A5Fi
— ESPNcricinfo (@ESPNcricinfo) June 9, 2022
ఇది కూడా చదవండి: IND vs SA T20 Series: తాగాల్సింది బీర్లు కాదు.. వాటర్! ఆటగాళ్లకు కెప్టెన్ సలహా!