టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విషయంలో అదృష్టం కలిసొస్తోంది. అంతకు ముందు టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియాను దారుణంగా దెబ్బతీసిన అంశం ఒకటుంది. అదే టాస్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఎక్కువసార్లు ఓడిపోయేవాడు. అంతకుముందు కెప్టెన్‌గా ఉన్న ధోని టాస్ ఎక్కువసార్లు గెలిచేవాడు.
టాస్ కీలకమైన మ్యాచ్‌లలో భారత్ టాస్ ఓడిపోవడం దాంతో పాటు మ్యాచ్ ఓడిపోవడం జరిగేది. కానీ ఒక విషయం గమనిస్తే.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత నుంచి కెప్టెన్‌గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ టాస్ కోసం వెళ్లారు. ఆశ్చర్యకరంగా అన్ని సార్లు టీమిండియానే టాస్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ నియమించింది.
టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ద్రవిడ్ కోచ్‌గా ఉన్నారు. ఆ ఐదు మ్యాచ్‌లలో భారత్ టాస్ గెలిచింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో కూడా భారత్ కెప్టెన్లు టాస్ గెలిచారు. ఇలా ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ ఆడిన 8 మ్యాచ్‌లలో భారత్ టాస్ ఓడిపోలేదు.
India has won 8/8 coin tosses since Rahul Dravid became coach. Bhai head/tails kar rahe ho ya Hindi/English? 😆 #SAvIND #IYKYK pic.twitter.com/CbZhRcNQvV
— Wasim Jaffer (@WasimJaffer14) January 11, 2022
ఇవాళ ద్రవిడ్ జన్మదినం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి విమల్ పాన్ మసాలా పౌచ్ కవర్‌ను జోడిస్తూ.. టాస్ కాయిన్‌కు బొమ్మ, బొరుసు పెట్టారా? లేకా రెండు వైపులా ఒక గుర్తును పెట్టారా? అని సరదాగా అన్నాడు. మరి ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ వరుసగా టాస్ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Dravid Birthday Special: రాహుల్ ద్రవిడ్ ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడా?