జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. భారత్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అద్భుతంగా ఆడి తన జట్టుకు మంచి విజయం అందించాడు. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది.
తర్వాత దక్షిణాఫ్రికాను కూడా తక్కువ స్కోర్‌కే 229కే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 243 పరుగుల లక్ష్యం ఉంచింది. మూడో రోజు వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగినా.. నాలుగో రోజు ప్రోటీస్ వైపు ఏకపక్షం అయిపోయింది. నాలుగో రోజు టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక మూడో టెస్టు ఈ నెల 11 నుంచి ప్రారంభ కానుంది.
India have never lost a test match defending 200 or more runs under Virat Kohli’s captaincy.
Did India miss their regular Test captain in the second Test vs SA? 🤔#ViratKohli #SAvIND pic.twitter.com/8den6FULbn
— Wisden India (@WisdenIndia) January 6, 2022
కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడిఉంటే..
కాగా ఈ మ్యాచ్ ఓటమిపై భిన్నమైన విమర్శలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలర్లు సరిగ్గా రాణించకపోవడం వల్లే భారత్ ఓడిందనే వాదన ఉన్నా.. విరాట్ కోహ్లీ ఆడకపోవడం కూడా భారత్ ఓటమి, ప్రోటీస్ జట్టు గెలుపుకు ముఖ్య కారణంగా కొంతమంది మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలర్లను సమర్థవంతంగా వినియోగించలేదని, అందుకే ప్రోటీస్ బ్యాటర్లు సునాయసంగా బ్యాటింగ్ చేశారని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విరాట్ కోహ్లీ అటాకింగ్ కెప్టెన్సీని మిస్ అయిందని సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పోలాక్ కూడా అభిప్రాయపడ్డారు.
కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీ వల్ల.. నాలుగో రోజు సౌత్ ఆఫ్రికాను ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే వాడని పోలాక్ అభిప్రాయం అయిఉంటుంది. ఇక ఈ గెలుపు కోహ్లీ లేకపోవడం వల్లే సౌత్ ఆఫ్రికాకు దక్కినట్లు.. కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా కోహ్లీ థ్యాంక్స్ చెప్పాలని అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ లేకపోవడం టీమిండియా నిజంగానే నష్టం చేసిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In the search of trophies We lost a leader 👑#ViratKohli #INDvSA • @imVkohli pic.twitter.com/tbzAGFSGLQ
— VIRATian farid¹⁸ (blue tick) (@IAmFarid18) January 6, 2022
India surely missed the energy virat kohli brings on the field!!✨ #ViratKohli #INDvSA pic.twitter.com/hr8GyRYTug
— Unobtrusive_17🇮🇳 (@unobtrusive_178) January 7, 2022